పసిడి ధర దిగివచ్చింది. గోల్డ్ రేటు తగ్గడం వలన కొనుగోలుదారులకు కాస్త ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర వెలవెలబోయింది. నిన్న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 570 తగ్గడంతో రూ.51,650కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10గ్రాములకు రూ.530 వరకు తగ్గగా 10 గ్రాములకు రూ.47,340కు చేరింది. కానీ బంగారం ధర భారీగా తగ్గితే వెండి ధర మాత్రం బాగానే పెరిగింది. గత మూడురోజులలో వెండి ధర భారీగా పెరిగింది.ఏకంగా కేజీ వెండి ధర 3100 దాకా పెరిగింది. దీని ప్రకారం వెండి ధర రూ. 65200కు చేరింది.
అయితే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.