NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

పోస్టాఫీస్‌లో అద్దిరిపోయే స్కీమ్‌.. నెల‌కు రూ.10 వేలు క‌డితే.. 16 లక్ష‌లు మీ సొంతం!

భార‌తీయ పోస్టాఫీసుల ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఎందుకంటే అవి అందించే సేవ‌లు అలాంటివి మ‌రి. ఇప్ప‌టికే బ్యాంకుల‌తో స‌మానంగా డ‌బ్బులు సేవింగ్ చేసుకునే స‌దుపాయాల‌ను పోస్టాఫీసులు అందిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా కొన్ని స్కీమ్‌లైతే వినియోగ‌దారుల‌కు మంచి ప్రయోజ‌నాలు క‌లిగించేవిగా ఉంటాయి. అలా త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు అత్యంత లాభ‌దాయ‌క‌మైన స్కీమ్‌లు చాలానే తీసుకువ‌చ్చిన పోస్టాఫీసులు.. మ‌రో అద్దిరిపోయే స్కీమ్ కూడా అందిస్తున్నాయి.

పోస్టాఫీసులు అందిస్తున్న ఆ సేవ‌లే రిక‌రింగ్ డిపాజిట్ స్కీమ్ (ఆర్‌డీ స్కీమ్‌). ఈ స్కీమ్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం ద్వారా మంచి లాభాల‌ను పొంద‌వ‌చ్చు. దీనికి తోడు ఇందులో మ‌నీ పెట్ట‌డం వ‌ల్ల రిస్కు కూడా త‌క్కువ‌గానే ఉంటుంది. రిస్కు లేకుండా మంచి రాబ‌డి పొంద‌ల‌నుకునే వారికి ఈ రిక‌రింగ్ డిపాజిట్ స్కీమ్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. త‌క్కువ మ‌నీతోనే దాదాపు 16 లక్ష‌ల‌కు పైగా మనీని తిరిగి పొంద‌వ‌చ్చు.

పోస్టాఫీసులు అందిస్తున్న ఈ రిక‌రింగ్ డిపాజిట్ స్కీమ్‌లో నెల‌కు 100 రూపాయ‌ల నుంచి పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. గ‌రిష్టంగా ఇన్వెస్టు ఇంతే చేయాలి అనే నిబంధ‌న కూడా లేక‌పోవ‌డం అనుకూలించే అంశం. పోస్టాఫీసుల రిక‌రింగ్ డిపాజిట్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదు సంవ‌త్స‌రాలుగా ఉంటుంది. ఈ స‌మ‌యంలో మీ డ‌బ్బుపై వ‌చ్చే వ‌డ్డీ మీ అకౌంట‌లో జ‌మ అవుతుంది. అంటే, ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక సారి ఈ వ‌డ్డీ జ‌మ అవుతుంది. రిక‌రింగ్ డిపాజిట్ స్కీమ్ లో వ‌డ్డీ 5.8 శాతానికి పైగా ల‌భిస్తుంది.

అయితే, వ‌డ్డీ ల‌భించే శాతాలుకొద్దిగా మారుతూ ఉంటాయి. ఈ ఏడాది జూలై నుంచి 5.8 శాతం వ‌డ్డీ వ‌స్తోంది. అయితే, ప్ర‌స్తుతం అందిస్తున్న వడ్డీ వివ‌రాల కోసం ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌ను చూడండి. అయితే, మీరు నెల‌కు 10,000 రూపాయ‌లు గ‌న‌క రిక‌రింగ్ డిపాజిట్ స్కీమ్‌లో జ‌మ‌చేస్తే.. మీకు ప‌ది సంవ‌త్స‌రాల తరువాత రూ.16.28 ల‌క్ష‌ల ల‌భిస్తాయి. అయితే, టైం టూ టైం మ‌నీ క‌డుతూ ఉండాలి. ఒక‌వేళ లేటుగా క‌డితే ఫైన్ ప‌డుతుంది. మ‌రీ ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విష‌య‌మేంటంటే.. ఈ స్కీమ్‌లో చేరిన త‌రువాత వ‌రుస‌గా నాలుగు నెల‌లు మ‌నీ క‌ట్ట‌క‌పోతే.. మీ అకౌంట్ ఆటోమెటిక్‌గా క్లోజ్ అవుతుంది. కాబ‌ట్టి ఈ విష‌యంలో కాస్త జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది.

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju