Power Star: తెలుగు చలనచిత్ర సీమలో పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, మెగాస్టార్ అంటే ఎవరో తెలియని వారు ఉండరు. కానీ తెలుగు రాష్ట్రాలు దాటితే వీరి గురించి సినీ సెలబ్రిటీలకు తప్ప మిగతా వారికి అంతగా తెలియదు. కాగా తాజాగా ఒక అమెరికన్ నటిలో మెగా పవర్ స్టార్, పవర్ స్టార్ హీరోల గురించి తెలుసుకోవాలని కుతూహలం పుట్టింది. అమెరికన్ యాక్ట్రెస్ రెబెక్కా గ్రాంట్ (Rebecca Grant) వారి గురించి అడగడం ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేస్తోంది.
Power Star: ఏమని అడిగింది అంటే
అది మరేంటో కాదు.. “టాలీవుడ్ మెగా పవర్ స్టార్ ఎవరు? చిరంజీవినా?” అంటూ ఆ నటి అడిగిన ప్రశ్న ఇప్పుడు వైరల్‌గా మారింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అందరినీ ఎంతగానో అలరించింది. ఇప్పటివరకు ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా సినిమా ఇప్పుడు అమెరికా సాటర్న్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు గెలుచుకుంది. ఆ సందర్బంగా రాజమౌళి ధన్యవాదలు తెలియ్యజేస్తూ, అతని డైరెక్షన్లో వచ్చిన ఇంకో పాన్ ఇండియా మూవీ బాహుబలి ది కంక్లూజన్ సినిమా కూడా స్టాటర్న్ అవార్డు విన్ అయినందుకు సంతోషం వ్యక్తం చేశాడు.
ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటంటే
ఆర్ఆర్ఆర్ అవార్డు గెలుచుకున్న సందర్భంగా అమెరికా నటి రెబెక్కా గ్రాంట్ సోషల్ మీడియాలో తన అభిప్రయాలను పంచుకుంటూ “బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా చూసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది” అని పేర్కొంది. ఆ తరువాత “చిరంజీవి ప్రభాస్, రామ్ చరణ్ కంటే ముందు భారతదేశంలో పవర్ మెగా స్టార్‌గా ఉన్నారా? అతను నటించిన, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఉన్న ఏ సినిమాని నేను చూడాలి?” అని అడిగింది. తెలుగు సినిమాల గురించి, తెలుగు హీరోల గురించి ఒక అమెరికన్ నటి అడగడంతో టాలీవుడ్ సినీ ప్రేమికులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే చిరంజీవి నటించిన మంచి సినిమాలను ఆమెకు సజెస్ట్ చేస్తున్నారు.
Was @KChiruTweets a power mega star in #India before #Prabhas𓃵 and #RamCharan𓃵?
Which movie should I watch of his that might have English subtitles?
— Rebecca Grant (@rebeccagrants) October 25, 2022