కరోనా లాక్ డౌన్ తో కళ తప్పిన సినిమా ఇండస్ట్రీ 7 నెలల తర్వాత కళకళాలాడుతోంది. చిన్న సినిమా నుంచి ఆర్ ఆర్ ఆర్ వరకు అన్ని సినిమాల షూటింగ్స్ దాదాపు మొదలైనట్టే. ఆచార్య లాంటి సినిమా కూడా వచ్చే నెల నుంచి సెట్స్ మీదకి రాబోతుందని సమాచారం. కాగా ఈ 7 నెలల నుంచి సినిమాల షూటింగ్స్ లేక తమ అభిమాన హీరోల సినిమా టీజర్స్, ట్రైలర్స్, సాంగ్ ప్రోమోస్ కోసం ఫ్యాన్స్ తెగ ఆరాట పడ్డారు. అందుకే ఇటీవల షూటింగ్ మొదలు పెట్టిన సినిమాల నుంచి టీజర్స్ ని దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.
ముందుగా ఆర్ ఆర్ ఆర్ నుంచి ఎన్.టి.ఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్ర ని రివీల్ చేయనున్నట్టు ఇప్పటికే అధికారకంగా రాజమౌళి ప్రకటించాడు. ఈ నెల 22 ఈ టీజర్ రిలీజ్ కానుంది. రామరాజు ఫర్ బీమ్ పేరు తో రిలీజయ్యే ఈ టీజర్ కోసం నందమూరి అభిమానులతో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులందరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ నెల 23 యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఎన్ని సర్ప్రైజెస్ రానున్నాయో సస్పెన్స్ గా ఉంది. అయితే ఖచ్చితంగా రాధే శ్యామ్ సినిమా నుంచి మాత్రం టీజర్ రానుందని సమాచారం. అలాగే నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ సినిమా నుంచి టీజర్ గాని ట్రైలర్ గాని రానందని తెలుస్తుంది. ఇక మిగినిలిన మరికొన్ని సినిమాల నుంచి టీజర్స్ లేదా ట్రైలర్స్ రిలీజ్ కి మేకర్స్ సిద్దమవుతున్నారు.
అయితే బర్త్ డే సందర్భంగా తన సినిమాలన్నిటిని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఈ దసరా పండుగ కి మాత్రం ఎలాంటి అప్డేట్ ఇవ్వలేకపోతున్నట్టు సమాచారం. ముఖ్యంగా అందరూ వకీల్ సాబ్ నుంచి ట్రైలర్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. మరి వకీల్ సాబ్ నుంచి ఆ సర్ప్రైజ్ ఉంటుందా లేదా అన్నది చూడాలి. అయితే ఎదురు చూడకుండా ఉంటే మంచిదని లేదంటే డిసప్పాయింట్ అవాల్సి వస్తుందని అంటున్నారట. ఒకవేళ ఊహించని విధంగా వకీల్ సాబ్ నుంచి ఏదైనా వస్తే అది సర్ప్రైజ్ అనుకోవాలంటున్నారు.