టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కి ఉన్న పెద్ద డ్రీం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక భారీ సినిమా చేయాలని. ఈ డ్రీం దాదాపు పదేళ్ళుగా ఉందట. అంటే దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలని పదేళ్ళ నుంచి ట్రై చేస్తున్నాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎట్టకేలకి వకీల్ సాబ్ దిల్ రాజు డ్రీం ని నిజం చేయబోతోంది. దాదాపు మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దాదాపు ఈ సినిమా 90 శాతం టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. కేవలం ఒక సాంగ్ తో పాటు శృతిహాసన్ తో పవర్ స్టార్ పాల్గొనాల్సిన కొన్ని సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయట.
కాగా జనవరి నుంచి సాంగ్ తో పాటు బ్యాలెన్స్ షూటింగ్ ని కంప్లీట్ చేస్తారని సమాచారం. ఈ సినిమాకి వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాశ్ రాజ్మ్ సీనియర్ నరేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇక ఎస్ ఎస్ థమన్ సంగీతమనిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ముందెన్నడు కనిపించని విధంగా మేకోవర్ అయ్యాడు. ఈ గెటప్ కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకి విపరీతంగా నచ్చింది. వకీల్ సాబ్ టైటిల్ పోస్టర్ తో పాటు పవన్ కళ్యాణ్ లుక్ ని రిలీజ్ చేసినప్పటి నుంచి భారీగా అంచనాలున్నాయి.
కాగా తాజా సమాచారం ప్రకారం మాస్ ఆడియన్స్ కి పవర్ స్టార్ ని ఎలా చూపిస్తే పూనకాలొస్తాయో అలా ఫస్ట్ సీన్ లో చూపించబోతున్నారని తెలుస్తోంది. అది కూడా తాగుబోతు క్యారెక్టర్ లో పవర్ స్టార్ ని వకీల్ సాబ్ లో ఫస్ట్ సీన్ లో గ్రాండ్ గా రివీల్ చేయబోతున్నారని … ఈ సీన్ తో ఫ్యాన్స్ థియోటర్స్ లో చేసే హంగామా అంతా ఇంతా ఉండదని అంటున్నారు. ఇక గతంలో కూడా పవర్ స్టార్ ఇండస్ట్రీ రికార్డ్ సాధించిన ఖుషీలో కూడా ఇలాంటి సీన్ సినిమాకి హైలెట్ గా నిలవడమే కాదు ఆ సీన్ ని ఇప్పటికీ ప్రేక్షకులు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తుంటారు. మరి వకీల్ సాబ్ లో పవర్ స్టార్ ఎంట్రీ సీన్ ఎలా ఉంటుందో చూడాలి.