ఇస్మార్ట్ బ్యూటీకి అదిరిపోయేలా ఆఫర్ ఇచ్చిన పవర్ స్టార్.. ఇక టాలివుడ్ లో స్టార్ హీరోయిన్ అవడం ఖాయం ..?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వం వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ వరకు కంఫ్లీట్ అవుతుంది. 2021 సంక్రాంతి కి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాలి. కానీ ముందు మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనం కోషియం రీమేక్ లో పవర్ స్టార్ నటించబోతున్నాడు.

Pawan Kalyan's Vakeel Saab teaser to release on October 25? - Movies News

కాగా ఈ సినిమాకి అప్పట్లో ఒకడుండేవాడు సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నారు. కాగా ప్రస్తుతం మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు జరుగుతున్నాయని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో పవర్‌స్టార్ బీజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించనుండగా మరో పాత్ర పృథ్వి రాజ్ పాత్ర ఎంపిక జరగాల్సి ఉంది. అయితే ఈ పాత్ర కోసం రానా దగ్గుబాటి ని సంప్రదించినట్టు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ రానుందని అంటున్నారు. అయితే క్రిష్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు రాబోతున్నాడట.

శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 15 రోజుల పాటు ఒక షెడ్యూల్ జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ అయ్యప్పనం కోషియం రీమేక్ లో కూడా నటించబోతున్నాడు. క్రిష్ సినిమా అలాగే అయ్యప్పనం కోషియం రీమేక్ సమాంతరంగా షూటింగ్ జరగబోతున్నాయని సమాచారం.

అయితే డిసెంబర్ నుంచి క్రిష్ కూడా ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ గా ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధీ అగర్వాల్ ని తీసుకోవాలని క్రిష్ భావిస్తున్నాడట. ఈ విషయం పవర్ స్టార్ అని అడగ్గా పవర్ స్టార్ కూడా నిధి కే ఓటేసినట్టు సమాచారం. ఇదే గనక నిజమైతే నిధి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవడం ఖాయం అంటున్నారు.