పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎన్ని సంచనాలు సృష్ఠించిందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు నెలకొల్పింది. అప్పటి నుంచి ఈ ఇద్దరి కాంబినేషన్ లో మళ్ళీ ఇండస్ట్రీ రికార్డ్ క్రియోటయ్యే సినిమా ఎప్పుడొస్తుందా అని పవర్ స్టార్స్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా ఇటీవల పవర్ స్టార్ తన 28వ సినిమాని హరీష్ శంకర్ తో చేయబోతున్నట్టు ప్రకటించాడు.
అప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు భారీగా మొదలయ్యాయి. కాగా ఈ సినిమా కి సంబంధించిన న్యూస్ ఒకటి లీకయింది. ఈ సినిమాలో పవర్ స్టార్ కొన్ని సీన్స్ లో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని సమాచారం. అయితే ఈ సీన్స్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వస్తాయని తెలుస్తుంది. పవన్ పోలీస్ గెటప్ లో పవన్ ని చూపించడానికి హరీష్ శంకర్ కొత్తగా ట్రై చేస్తున్నట్టు సమాచారం.
దాంతో ఇప్పుడు హరీష్ – పవన్ చేయబోతున్న ఈ లేటెస్ట్ సినిమాలో కూడా పోలీస్ సీక్వెన్స్ ఉందనగానే ఇంకా ఈ సినిమా మీద ఊహించని రేంజ్ లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించడం దాదాపు కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’తో క్రిష్ సినిమా కూడా చేస్తున్నాడు. అలాగే క్రిష్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మొదటిసారి పిరియాడికల్ బ్యాక్ డ్రాప్లో సాగే కథ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే.