prabash birthday special : హీరో ప్రభాస్ బహుబలి సినిమా తర్వాత ఓవర్ నైట్‌లోనే పాన్ ఇండియా స్టార్‌గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విషయం తెలిసిందే. కానీ అంతకు ముందే మనోడు అభిమానులందరికీ ‘డార్లింగ్’ అయ్యాడు. ఈ రోజు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు వరల్డ్ వైడ్‌గా విషెస్ వెల్లువెత్తుతున్నాయి. డార్లింగ్ 42వ బర్త్ డే సందర్బంగా సోషల్ మీడియా మొత్తం హ్యాపీ బర్త్ డే (prabash birthday day) ప్రభాస్ అనే పేరుతో మోతమోగిపోతోంది. మనోడి అసలు పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి.. అభిమానులంతా ముద్దుగా డార్లింగ్ (darling) అని పిలుచుకుంటారు. పుట్టి పెరిగింది భీమవరంలోనైనా అనతి కాలంలోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్.
Heart Test: మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలిపే టెక్నిక్..!! కేవలం ఒక నిమిషంలో రిజల్ట్..!!
ప్రభాస్‌కు గోరింటాకు గిఫ్ట్..
ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ తమ అభిమానాన్ని డిఫరెంట్‌గా చాటుతున్నారు. ఓ మహిళ ఏకంగా తన చేతులపై ప్రభాస్ నటించిన మొత్తం సినిమాలను గోరింటాకుతో నింపేసింది. ప్రభాస్ అంటే తనకు పిచ్చి అభిమానం అని.. అందుకే ఈ విధంగా తన అభిమానాన్ని డార్లింగ్ బర్త్ డే సందర్భంగా తెలియజేసినట్టు ఆ మహిళ తెలిపింది.
Prabash: ప్రభాస్ బర్త్ డే రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్ ..!
అనుష్క ట్వీట్..
ప్రభాస్, హీరోయిన్ అనుష్క (anushka) ఎంత మంచి మిత్రులో తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ తెలుసు. వీరిద్దరూ పలు చిత్రాల్లో కలిసి నటించినా పర్సనల్ లైఫ్‌లో (personal life)వీరు చాలా క్లోజ్. అలా అని ప్రేమికులు కాదు.. చాలా మంది వీరిద్దరు నిజజీవితంలో ఒక్కటైతే బాగుంటుంది అని అనుకున్నార. కానీ మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుష్క క్లారిటీ ఇచ్చింది. ఒక ఇంటర్య్వూలో సినిమాలు, ప్రభాస్ ఈ ఇద్దరిలో ఎవరిని వదిలేస్తారు అని అడిగితే మన స్వీటీ నిర్మోహమాటంగా సినిమాలు అని తెలిపింది. అలాంటిది వీరి మధ్య బాండింగ్.. ప్రభాస్ పుట్టిన రోజున స్వీటీ నువ్వు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, కోరుకున్నది జరగాలంటూ పుట్టినరోజు విషెస్ తెలిపింది.
ఇకపోతే, ప్రభాస్ సొంతూరులో ఫ్యాన్స్ భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి నానా హంగామా చేస్తున్నారు. పలువురు సెలెబ్రిటీలు, నిర్మాతలు,నటీనటులు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రభాస్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇకపోతే జూబ్లీహిల్స్‌లోని ప్రభాస్ ఇంటివద్ద ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేస్తున్నారు.
Amrutha Kada: మన శరీరానికి అమృతంలా పనిచేసే అమృత కాడ ప్రయోజనాలు ఇవే..!!