Prabash:‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ బాగా పెరిగిపోయింది. ఈ సినిమాకు ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ అభిమానులున్నారు. కాగా, ప్రభాస్ ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్ మాత్రమే కాదు పాన్ వరల్డ్ హీరో అయిపోయారు. ఇకపోతే ప్రభాస్ ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్‌లోనే పాల్గొంటున్నాడు. వచ్చే ఐదేళ్లలో ప్రభాస్ చేయబోయే సినిమాలు ఏంటంటే..
భారీ బడ్జెట్ సినిమాల్లో డార్లింగ్..
‘సాహో’ వంటి యాక్షన్ ఎంటర్టైనర్ తర్వాత ప్రభాస్ ప్రేక్షకులకు కనిపించలేదు. ప్రస్తుతం ఒకేసారి ఐదు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు ప్రభాస్. ఈ ఐదు సినిమాల బడ్జెట్ రూ.1,200 కోట్లు ఉంటుంది. ఇకపోతే ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే డార్లింగ్ ప్రభాస్ నెక్స్ట్ చేయబోయే మూవీలు ఓకే చేసేస్తున్నాడు. మొత్తంగా హీరోగా ప్రభాస్ కెరీర్ చాలా బాగుందని చెప్పొచ్చు. అయితే, ఈ సినిమాలు వచ్చే ఐదేళ్లలో ఎప్పుడైనా రిలీజ్ కావొచ్చు.
Diabetes: డయాబెటిస్ ఉన్నవారు కచ్చితంగా ఈ సమయంలోనే టిఫిన్ చేయాలి.. ఎందుకంటే..!?
‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్‌తో ప్రభాస్ ఫిల్మ్..
‘జిల్’ ఫేమ్ డైరెక్టర్ రాధాకృష డైరెక్షన్లో ‘రాధే శ్యామ్’ఫిల్మ్ షూటింగ్ కంప్లీట్ చేసిన ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ షూటింగ్ బిజీలో ఉన్నాడు. ‘ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె’ చిత్రాలు ప్యారలల్‌గా కంప్లీట్ చేయాలని ప్రభాస్ అనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ హీరో ప్రభాస్ ముందుకు సాగిపోతున్నాడు. కాగా, ఈ మూవీస్ షూటింగ్ పూర్తి కాకమునుపే మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడట డార్లింగ్. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో సత్తా చూపి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ‘స్పిరిట్’ అనే సినిమా చేయబోతున్నాడు ప్రభాస్.
Konda polam: ‘కొండ పొలం’ సినిమాలో ఇదే హైలైట్..!
పాన్ వరల్డ్ ఫిల్మ్‌గా రాబోతుందట ఈ సినిమా. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతుండగా, ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీతో పాటు కొరియన్, జపనీస్, కొరియన్ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుందట. మొత్తంగా ప్రభాస్ నటించబోయే సినిమాల గురించి తెలుసుకుని సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?