PRABHAAS SALAAR : ప్రభాస్ చుట్టూ నలభై మంది పోలీసులు – సినిమా సీన్ కాదు నిజంగా జరిగిన సీన్ ! 

Share

PRABHAAS SALAAR :  బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన రెబల్ స్టార్ ప్రభాస్ అదే ఊపులో మరొక నాలుగు పాన్ ఇండియా చిత్రాలకు సంతకం చేశాడు. వీటిలో అన్నింటికంటే ఉత్కంఠ రేపే ప్రాజెక్ట్ కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోదావరి ఖని లో ప్రారంభం కాగా…. మొదటి షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశారు.

 

PRABHAAS SALAAR shooting needs 40 police
PRABHAAS SALAAR shooting needs 40 police

 ఈ చిత్రంలో ప్రభాస్ లుక్ కు సంబంధించిన ఫోటోలు కూడా లీక్ అయిన విషయం తెలిసిందే. ప్రభాస్ ను అల్ట్రా మాస్ అవతార్ లో చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. మొదట ఈ షెడ్యూల్ ని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజిఎఫ్) లో షూటింగ్ చేయాలని ప్రణాళిక వేసిన తర్వాత గోదావరిఖని బొగ్గు గనులు, కాళేశ్వరం ప్రాజెక్టు, పెద్దపల్లి సింగరేణి బొగ్గు గనుల పరిసర ప్రాంతాలు చిత్ర బృందాన్ని మంత్రముగ్ధులను చేశాయి. దీంతో వారు వెంటనే అక్కడికి వెళ్లి షూటింగ్ కు కావలసిన ప్రణాళికలు వేసుకున్నారు.

ప్రస్తుతం రామగుండం లో షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ ప్రాంతానికి నక్సల్స్ బెడద చాలా ఎక్కువ. సామాజిక వ్యతిరేక శక్తుల దాడి ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో…. ప్రభాస్ రాగానే అక్కడ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అతనితో సమావేశమయ్యారు. ఇక ప్రభాస్ కూడా తనకు భద్రత కల్పించాలని కోరగా లొకేషన్ లో 40 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. 

గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో షూటింగ్ కోసమే 40 మంది పోలీసులు ప్రభాస్ కు రక్షణ గా ఉండడం అనేది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయిక కాగా ప్రభాస్ ఈ చిత్రం కోసం తన షెడ్యూల్లో నాలుగు నెలలు ప్రభాస్ కేటాయించాడని తెలుస్తోంది.


Share

Related posts

RRR : ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ చూస్తే నోట మాటరాదంతే..?

GRK

వైసీపీ తో కాదు జనాలతోనే తిట్లు తింటున్న రాధాకృష్ణ .. కారణం ఇదే ! 

sekhar

బిగ్ బాస్ 4 : డబుల్ ఎలిమినేషన్ గుట్టు ఇదే..! కంటెస్టెంట్స్ ని పిచ్చోళ్ళను చేయనున్న నాగార్జున

arun kanna