Prabhas : ప్రభాస్ బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ప్రభాస్ కి జంటగా సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటిస్తోంది. సీనియర్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ముంబై లో శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. రిలీజ్ డేట్ కూడా మేకర్స్ ప్రకటించారు. 2022 ఆగస్ట్ 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు.
అయితే మొదటి సారి ప్రభాస్ పౌరాణిక సినిమాలో నటిస్తున్న కారణంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో ఎలా ఉంటాడో అని ప్రభాస్ అభిమానుల తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లోనూ విపరీతమైన ఆతృత కలిగి ఉన్నారు. ఇందుకు మేకర్స్ త్వరలో భారీ సర్ప్రైజ్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. వచ్చే శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ప్రభాస్ రాముడి లుక్ ని రిలీజ్ చేయబోతున్నారట.
Prabhas : ప్రభాస్ నాలుగు రకాల మోకోవర్స్ లో కనిపించబోతున్నాడు.
మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియదు గాని ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న నాలుగు పాన్ ఇండియన్ సినిమాలలో నాలుగు రకాల మోకోవర్స్ లో కనిపించబోతున్నాడు. రాధే శ్యాం సినిమాలో యంగ్ లుక్ లో లవర్ గా, సలార్ సినిమాలో ఊర మాస్ గెటప్ లో కనిపించబోతున్న ప్రభాస్ ఆది పురుష్ లో రాముడిగా కనిపించబోతున్నాడు. ఇక నాగ్ అశ్విన్ సినిమాలో ప్రభాస్ గెటప్ ఎలా ఉంటుందన్నది తెలియాల్సి ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?