న్యూస్ సినిమా

Prabhas: ఆదిపురుష్ బడ్జెట్ మొత్తం దానికేనా? పెద్ద రిస్కే…

Prabhas adipurush huge budget
Share

Prabhas: ఆదిపురుష్ ప్రభాస్ హీరోగా,ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న అతిపెద్ద మోషన్ గ్రాఫిక్స్ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఈ మూవీని ఎట్టిపరిస్థితుల్లో ఆగస్టులో విడుదల చేయాలని ఓం రౌత్ చూస్తున్నారు. ఈ సినిమా పూర్తయింది, విడుదల విషయంలో ఏమాత్రం అనుమానాలు లేవు. ఇకపోతే ఐదు వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 300 కోట్లు గ్రాఫిక్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం. కాగా ఆదిపురుష్ బడ్జెట్ గురించి ఫిలిం మేకర్స్ ఒక ప్రకటన ఇచ్చారు.

 

Prabhas adipurush huge budget

తాజాగా ఈ సినిమా కోసం నాలుగు వందల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు గా వార్తలు వినవచ్చాయి. ఈ భారీ మూవీ లో ఎక్కువగా గ్రాఫిక్స్ కే ఖర్చు చేస్తున్నారట. మన హీరో ప్రభాస్ కు 100 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు సమాచారం. దీనిపై సరిగ్గా క్లారిటీ లేదు.

ప్రభాస్ నటించిన ఈ సినిమాపై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్న ఈ సినిమాను దర్శకుడు ఓం రౌత్ ఏ మాత్రం తగ్గకుండా తెరమీదకు తీసుకు వస్తున్నారు. ఈ మూవీ ఇండియా లోనే అతి పెద్ద మోషన్ గ్రాఫిక్స్ సినిమా గా ఉంటుంది అని ఇండస్ట్రీ మొత్తం అనుకుంటుంది.

ఈ సినిమా లో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు. కృతి సనన్ సీత పాత్రలో, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఇంకొందరు కూడా కనిపించబోతున్నారు. పూర్తిస్థాయిలో రామాయణమే చూపించబోతున్నారా? ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం మీడియాలో నడుస్తున్నాయి.

 

ఈ సినిమా మొదలు పెట్టిన తర్వాత ఇప్పటి వరకు కాస్టింగ్ మాత్రమే రివీల్ చేశారు. ఇంకా ఏ విషయాలు రివీల్ కాలేదు. స్టోరీ ఏంటి సంగీతం ఎలా ఉంటుంది అది కూడా ఇంకా తెలియదు. ఈ సినిమా కథ రామాయణం అని మాత్రం తెలుసు. ఇంకా ఏ వివరాలు తెలియవు. హీరో ప్రభాస్ అభిమానులు, హిందూ సినీ అభిమానులు ప్రేక్షకులు ఈ రామాయణం చూడాలి అని ఉబలాటపడుతున్నారు. ప్రభాస్ కెరియర్ లో ఈ రామాయణం మరో బిగ్ హిట్ గా నిలవాలని సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.


Share

Related posts

ఒక్కసారిగా సీరియస్ అయిన ప్రధాని మోడీ..!!

sekhar

Uday Kiran: ఓటీటీలో విడుదలకానున్న ఉదయ్ కిరణ్ ఆఖరి చిత్రం..!!

bharani jella

సిబిఐ కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar