Prabhas : ఇపుడు డార్లింగ్ అన్నా, పాన్ ఇండియా స్టార్ అన్నా తెలుగు ప్రేక్షకులకు ఒకేఒక్కరు గుర్తుకు వస్తారు. ఆటగాడే రెబల్ స్టార్ ప్రభాస్. అవును.. బాహుబలి అనే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకుల డార్లింగ్ కాస్త, ఇంటర్నేషనల్ డార్లింగ్ అయిపోయాడు. ఇక ఈయన కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’. ఇందులో మన పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.
Prabhas : అభిమానులకు ఈ విషయం తెలియదా?
సహజంగా ఒక సినిమా హీరో అభిమానులు తన అభిమాన నటుడి ప్రతి ఉనికి తెలుసుకోవాలని ఆరాటపడుతూ వుంటారు. అయితే ప్రభాస్‌కు సంబంధించిన ఈ ఆసక్తికరమైన వార్త గురించి వీరికి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఇది తాజా వాడి వేడి వార్త గనుక. ఇక అసలువిషయంలోకి వెళితే, ‘రాధే శ్యామ్’ రిలీజ్ అయ్యే సమయానికి ప్రభాస్ హైదరాబాద్ లో ఉండదట. యూరప్ చెక్కేయనున్నాడట. అంటే హాలీడే ట్రిప్‌కు వెళుతున్నట్టు భోగట్టా. ప్రస్తుతం ఆయన ‘రాధే శ్యామ్’ ప్రమోషన్స్‌లో బిజీగా వున్న సంగతి విదితమే.
ఏంటి షాక్ తిన్నారా?
అవును. ఇది నిజంగా డార్లింగ్ అభిమానులకు షాకింగ్ వార్త మరి. ఈ సినిమాకోసం కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న అభిమానులు అదేరోజున ప్రభాస్ ఇక్కడ ఉండరంటే కొంచెం బాధాకరమైన విషయమే మరి. అయినా ఏం బాధలేదు లెండి.. మన వాడు వరుస సినిమా షూటింగ్స్ చేయడం వలన బాగా అలసి ఆలా యూరప్ ట్రిప్ కి వెళుతున్నాడు. ఇక ఆ సినిమా సక్సెస్ ని మీరు నేరుగా డార్లింగ్ సోషల్ మీడియా ఖాతాలోనే పంచుకోండి మరి!
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!