Prabhas: ప్రభాస్ + బాలివుడ్ హీరోల అందర్నీ దాటి నెంబర్ వన్ పొజిషన్ లోకి మహేష్ బాబు.!

Share

mahesh babu: టాలీవుడ్‌ అందగాడు, ప్రిన్స్‌, సూపర్ స్టార్ ట్యాగ్ ఏదైనా మనకు ఆ పేర్లు వినగానే ఒకే ఒక పేరు స్మరణకు వచ్చేస్తుంది. అతడే మహేష్‌ బాబు. ఇతగాడికి తెలుగునాట ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్‌ హీరోల్లో ఒకరిగా ఈయన స్థానం పదిలం. అటు సినిమాలతో పాటు ఇటు వ్యాపారంలోను దండిగా సంపాదిస్తున్న ఒకే ఒక్క హీరో మహేష్. ఆయన తెరపైనే కాకుండా సోషల్‌ మీడియాలో కూడా మేజిక్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుంటూ తన అభిమానులను అలరిస్తూ ఉంటాడు.

ఈ విషయమే ఇపుడు మహేష్ ని నెంబర్ వన్ పొజిషన్ లోకి చేర్చింది!

అదేనండి బాబు.. ట్విట్టర్‌లో మహేష్‌ బాబును ఏకంగా 12 మిలియన్‌ మంది ఫాలో అవుతున్నారు. ఈ విషయంలో మహేష్ తోపనే మనం ఒప్పుకోవాలి. భారతదేశంలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న అతికొద్ది మంది హీరోల్లో మహేష్‌బాబు ఒకరిగా ఉండటం విశేషం. అందువలన తాజాగా మరో అరుదైన ఘనతను కూడా సాధించారు. తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా చేసే ఒక్కో ట్వీట్‌కు ఎక్కువ లైక్స్‌ పొందిన వ్యక్తిగా మహేష్‌ బాబు రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. లక్ష లైక్‌లకు పైగా లైక్స్‌ ఉన్న 30 ట్విట్‌లతో మహేష్‌ అరుదైన గుర్తింపును సంపాదించుకున్నారు.

మన సూపర్ స్టార్ నెక్స్ట్ మూవీ పరిస్థితి ఏమిటి?

ప్రస్తుతం ఈ అందగాడు దుబాయ్‌లో హాలీడే ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోకు కూడా లక్ష లైక్‌లు పడిపోవడం కొసమెరుపు. ఇక మోకాలి సర్జరీ తర్వాత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న మహేష్‌ చిన్న గ్యాప్‌ తర్వాత ఫిబ్రవరి నుంచి ‘సర్కారు వారి పాట’ షూటింగులో జాయిన్ అవుతాడు. ఇకపోతే మహేష్ సాధించిన ఘనతలను చూసి తన అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


Share

Related posts

Today Horoscope అక్టోబర్ 10th శనివారం మీ రాశి ఫలాలు

Sree matha

YS Jagan: జ‌గ‌న్ స‌ర్కారు తేల్చుకోలేక‌పోతున్న అంశం ఏంటంటే…

sridhar

Tangedu Flower: తంగేడు పూలతో ఈ మొండి వ్యాధులు పరార్..!!

bharani jella