Prabhas: ప్రభాస్ ఇమేజ్ బాహుబలి అనే సినిమా తో ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒకే ఒక్క సినిమాతో ఇంతలా ఎదిగిపోయిన హీరోలు ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలోనే లేరు. ఈ మాట అతిశయోక్తి కాదు. బాహుబలి తర్వాత సాహో చేసిన ప్రభాస్ కూడా ఆ చిత్రం ఫ్లాప్ అయినా కూడా తన ఇమేజ్ ఎక్కడా తగ్గలేదు. ప్రభాస్ క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ప్రభాస్ హీరోగా ఆదిపురుష్, సాలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ వంటి భారీ చిత్రాలు రాబోతున్నాయి.
ఆది పురుష షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. రామాయణం కథతో తెరకెక్కుతున్న ఆదిపురుష్ ఈ 2022 లో మన ముందుకు రావాల్సి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన విడుదల భారీగా ఉంటుందని సమాచారం. ప్రభాస్ క్రేజ్ తో పాన్ వరల్డ్ లెవెల్ లో ఈ చిత్రం విడుదల ప్లాన్ చేస్తున్నట్టు మీడియా వెల్లడించింది.
ఆది పురుష దేశవ్యాప్తంగా 15 భాషల్లో రిలీజ్ అవుతుంది. దాదాపు ప్రతి ముఖ్యమైన భాషలో సినిమా విడుదల ఉంటుంది. పాన్ ఇండియా సినిమా అంటే నాలుగు అయిదు భాషల్లో రిలీజ్ చేస్తారు. ఆది పురుష సినిమా రామాయణం కథతో తెరకెక్కిస్తున్నారు కాబట్టి అన్ని లోకల్ భాషల్లోనూ అందించాలని డబ్బింగ్ చేస్తున్నారట.
ప్రపంచ స్థాయిలో ఇంగ్లీష్ మాత్రమే కాకుండా చైనీస్ జపనీస్ వంటి భాషల్లో ఈ సినిమా ను మనకు అందించబోతున్నారట. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా 20 వేల స్క్రీన్ లలో రిలీజ్ కు సిద్ధపడుతున్నారుఅట. ఇదే జరిగితే ఆది పురుష చిత్రం రికార్డు సృష్టించబోతోంది అనటంలో సందేహం లేదు. షూటింగ్ ముందుగానే పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కోసం చాలా సమయం తీసుకుంటున్నారు. తానాజీ, డైరెక్టర్ ఓం రౌత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ సీతగా చేస్తుంది. ఈ న్యూస్ అంతా విన్న తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అనాల్సిందే.