న్యూస్ సినిమా

ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన ప్రభాస్..!!

Share

“రాధేశ్యామ్” సినిమాకి సంబంధించి మొదటి నుండి అభిమానులకు నిరాశ కలిగే విధంగానే సిచువేషన్ లు ఉన్నాయి. “సాహో” సినిమా అట్టర్ ప్లాప్ అయిన తర్వాత ప్రభాస్ ఈ సినిమా ప్రకటించి అసలు సినిమాకి సంబంధించి షూటింగ్ జరుగుతుందా లేదా అన్నది బయట ప్రపంచానికి తెలియకుండా కానిచ్చేశారు. దాదాపు కొన్ని నెలలపాటు సినిమాకి సంబంధించిన ఫోటో గాని ఎటువంటి అప్ డేట్ బయటకు రాలేదు.

Radhe Shyam Motion Poster: Prabhas and Pooja Hegde's romantic moment and  intense BGM is all things magical | PINKVILLAతర్వాత ప్రభాస్ పుట్టిన రోజు నాడు సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేశారు . అప్పటి వరకూ ప్రభాస్ అభిమానులు “రాధేశ్యామ్” సినిమా యూనిట్ పై విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఇప్పుడు సినిమాకి సంబంధించి టీజర్ విషయంలో కూడా ఇదే రీతిలో సినిమా యూనిట్ వ్యవహరించడంతో అభిమానులు సీరియస్ అవుతున్నారు.

 

లాక్ డౌన్ తర్వాత ఒకపక్క మిగతా హీరోల సినిమాలు మరియు టీజర్ లు రిలీజ్ అవుతున్న తరుణంలో “రాధేశ్యామ్” టీజర్ రిలీజ్ కాకపోవడం పట్ల ఆగ్రహం చెందుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా సినిమా టీజర్ రిలీజ్ అవుతున్నట్లు సినిమా యూనిట్ అభిమానులను ఊరించగా.. అది కాస్తా ఆవిరైపోయింది. సంక్రాంతి పండుగ కైనా రిలీజ్ అవుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. దీంతో సినిమా యూనిట్ పై ఆగ్రహం చెందుతూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


Share

Related posts

పెళ్లి చేసుకొని ఏం పీకాలంటున్న వి.వి.వినాయక్!

Teja

కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం వెనుక‌… ఇంత స్కెచ్‌ ఉందా?

sridhar

ఏపీలో 12 గంటల్లో 21 కొత్త కేసులు 132 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar