కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ తాజాగా రిలీజై కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటి ఏ సినిమా టీజర్ సాధించలేని వ్యూస్ ని సాధించడం ఏ ఒక్కరు ఊహించలేకపోతున్నారు. టీజర్ రిలీజైన ఒక గంట యాబై రెండు నిముషాలలోనే 10 మిలియన్స్ వ్యాస్ రాబట్టిందంటే kgf chapter 2 సినిమా ప్రాంచ వ్యాప్తంగా ఎంతటి క్రేజ్ నెలకొందో అర్థమవుతోంది. గత కొన్ని రోజులుగా kgf chapter 2 టీజర్ గురించి ఆసక్తిగా ఎదురు చూసిన కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఫ్యాన్స్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ కి వాళ్ళ ఎదురు చూపులకు తగ్గట్టే ఇంకా చెప్పాలంటే వాళ్ళ అంచనాలకి మించి ఉండటం విశేషం.
తాజాగా రిలీజైన టీజర్ లో యష్ తో పాటు kgf chapter 2 లో కీలక పాత్రలు పోషిస్తున్న బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ .. రవీనాటాండన్..ప్రకాష్ రాజ్ .. రావు రమేష్ పాత్రలను రివీల్ చేశారు. హై ఓల్టేజ్ తో ఈ టీజర్ చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ తో నే కేజీఎఫ్ ఛాప్టర్ 1 కంటే నాలుగు రెట్లు ఎక్కువ యాక్షన్ ఉండబోతోందని అర్థమవుతోంది. అంతేకాదు తాజాగా రిలీజైన kgf chapter 2 టీజర్ చూస్తుంటే ఖచ్చితంగా బాహుబలి రికార్డ్స్ బద్దలవుతాయేమో అని చెప్పుకుంటున్నారు.
అంతేకాదు ఎప్పుడైతే kgf chapter 2 టీజర్ రిలీజైందో అప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారట. అందుకు కారణం సలార్. ప్రశాంత్ నీల్ యష్ నే ఇలా చూపించాడంటే సలార్ లో ఇక మా ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నాడో అన్న క్యూరియాసిటీ అందరిలోను పెరిగిపోతోందంటున్నారు. నిజంగా ప్రభాస్ ని సలార్ లో ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా కొత్తగా.. పవర్ ఫుల్ రోల్ లో ప్రజెంట్ చేయబోతున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న సలార్ విజయదశమికి రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం.