Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ మధ్య బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. ప్రభాస్ కోసం ఫ్యాన్స్ ఎలాంటి పనిచేయాడానికైనా రెడీగా ఉంటారనే విషయం ఇటీవల జరిగిన రెండు సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. ఒకటి రాధే శ్యామ్ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ విషయంలో మేకర్స్ చాలా ఆలస్యం చేశారు. చెప్పిన సమయానికి రిలీజ్ చేసిన సమయానికి అసలు సంబంధం లేదు. సాంగ్ ప్రాసెసింగ్ అంతా ముంబైలో జరగడంతో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల గంటల కొద్దీ లేట్ అయింది. ఎప్పుడో రాత్రికి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది.
అంతసేపూ ఎదురుచూసి సహనం కోల్పోయిన ఓ అభిమాని ఏకంగా యూవీ క్రియేషన్స్ నిర్మాతలను అరెస్ట్ చేయండి..మా ఎమొషన్స్తో ఆడుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా వాపోయాడు. ఇక మరో అభిమాని ప్రభాస్ అంటే ఎంత పిచ్చో తెలియడానికి తన తలపై జుత్తు మొత్తం కత్తిరించుకొని ప్రభాస్ అనే పేరు కనిపించేలా ట్రిమ్ చేసుకున్నాడు. తన తలపై చూస్తే ప్రభాస్ అని పేరు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చాలా ఫన్నీగా ఉన్నా ఇందులోనే ప్రభాస్ అంటే అతనిని ఎంతటి అభిమానమో తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఆ అభిమానిని పిలిపంచుకొని కాసేపు సరదాగా మాట్లాడి ఓ ఖరీదైన వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు.
Prabhas: ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ సినిమాను ఎప్పుడు మొదలు పెడతాడు..?
ఇలాంటి అభిమానులు ప్రభాస్ సినిమాను లేటుగా తీసే దర్శకులను వదులుతారా ..ఓ ఆటాడుకుంటారు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగానూ అదే విధంగా ట్రోల్ చేస్తున్నారట. అర్జున్ రెడ్డి సినిమాతో పాపులర్ అయిన ఈ దర్శకుడు బాలీవుడ్లో అదే సినిమాను కబీర్ సింగ్‌గా రూపొందించి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇటీవలే ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాకు సందీప్ రెడ్డి కూడా ఓ నిర్మాత. అయితే ఇప్పుడు బాలీవుడ్లో తెరకెక్కిస్తున్న యానిమల్ సినిమాను 2023 ఆగస్టు 11న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అది చూసి ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాను ఎప్పుడు మొదలు పెడతాడు..ఎప్పుడు రిలీజ్ చేస్తాడు..అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా ట్రోల్ కూడా చేస్తున్నారు. మరి ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగాల స్పిరిట్ ఎపుడు మొదలవుందో చూడాలి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!