Prabhas : అవును.. డార్లింగ్ ప్రభాస్ తో వారికి పోలికేమిటి నాన్సెన్స్? ప్రభాస్ అంటే ఏమిటో బాలీవుడ్ ని అడిగితే చెబుతారు. ఒకప్పుడు సినిమా అంటే హిందీ సినిమానే అన్నవాళ్లకి, ఇపుడు సినిమా అంటే తెలుగు సినిమానే అన్న స్థాయికి వచ్చింది మనం తెలుగు పరిశ్రమ. దానికి కారణం అందరికీ తెలిసినదే. బాహుబలి సినిమాతో రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇందులో డార్లింగ్ ప్రభాస్ కంట్రిబ్యూషన్ అంతాఇంతా కాదు. అందుకే ప్రభాస్ నేడు పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.
Prabhas : నిజంగా వారికి, ప్రభాస్ కి పోటీనా?
ఇక అసలు విషయంలోకి వెళితే, కరోనా వేరియంట్ ఓమిక్రాన్ వలన తాజా పరిస్థితుల గురించి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో సినిమాల పరిస్థితి చాలా అద్వానంగా మారింది. ఇక తాజా పరిస్థితులు గురించి ఓసారి మనం సమీక్షించుకుంటే ఇపుడు పరిస్థితులు కొంచెం నయమనే చెప్పుకోవాలి. దాంతో రిలీజ్ డేట్స్ వాయిదా పడిన సినిమాలు వరుసగా మళ్ళీ డేట్స్ ఫిక్స్ చేసుకొనే పనిలో పడ్డాయి. దాంతో కొన్ని కొన్ని సినిమాలకు క్లాష్ తప్పడంలేదు.
ఆ భారీ క్లాష్ విషయం ఇదే..
ఇంతకీ ఆ భారీ క్లాష్ సంగతి చూస్తే, ఆల్రెడీ ‘రాధేశ్యామ్’రిలీజ్ డేట్ ఇచ్చేసారు. సరిగ్గా అదే సమయానికి అంటే ఒకరోజు ముందు అనగా మార్చి 10న థియేటర్లలోకి వస్తున్న మరో సినిమా సూర్య నటించిన తమిళం డబ్బింగ్ వెర్షన్ సినిమా రిలీజ్ కాబోతోంది. అందువలన కొంతమంది సదరు సినిమాల విషయంలో కాస్త టెన్షన్ పడుతున్నారు. ముఖ్యంగా రాధేశ్యామ్ ఓపెనింగ్స్ కి ఇబ్బంది వస్తుందేమో అని అనుకుంటున్నారు. ఇకపోతే ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ అనుమానాలను తోసిపుస్తున్నారు. వారితో ప్రభాస్ కి పోటేమిటి? అర్ధం లేని ప్రశ్నలు అంటూ వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు.