Prabhas : ప్రముఖ సినీ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ అనే మూడు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. రాధేశ్యామ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉండగా.. ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రీకరణ పూర్తవుతోంది. దీంతో పాటు దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి ప్రభాస్ ప్రాజెక్టు K అనే సినిమా చేస్తున్నారు. అయితే “ఈ ఆపేయి అన్నా .. నీకు దండం పెడతాం” అని అభిమానులు ప్రభాస్‌కు మొర పెట్టుకుంటున్నారు. భారీ బడ్జెట్ లో వస్తున్న చిత్రాన్ని ఎందుకు ఆపేయమని అడుగుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ K సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాని 2023 వేసవికాలంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం యోచిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఓ నిజం బయటపడి అభిమానులందరినీ నివ్వెరపరుస్తోంది. అదేంటంటే, ఈ సినిమాలో ఒక పూర్తి ఎపిసోడ్ మరో భారీ బడ్జెట్ సినిమాలోని సన్నివేశాలను పోలి ఉంటుందట. అందుకే ఆ ఎపిసోడ్ మార్చేసి కొత్తగా ప్రేక్షకుల ముందుకు సినిమాని తీసుకురావాలని నాగ్ అశ్విన్ ఇప్పుడు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే స్క్రిప్ట్ మారుస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యంలో ఫ్యాన్స్ కాస్త కలవరపడుతున్నారు. భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమా వేరే సినిమాలాగా ఉండటం వల్ల దాన్ని చూసే ఆసక్తి సన్నగిల్లుతుందని అంటున్నారు.
ప్రాజెక్ట్ K అనేది టైం ట్రావెల్ ఇతివృత్తంతో వస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ భవిష్యత్తులోకి కాలగమనం చేస్తాడట. ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా స్క్రిప్ట్ కోసం నాగ్ అశ్విన్ ఏకంగా రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డాడు. అయితే అనూహ్యంగా అతని ఆలోచనలు, బ్రహ్మాస్త్ర సినిమా స్క్రిప్ట్ రైటర్ల ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయని తేలింది. సూపర్ హీరో ఫిలిం అయిన బ్రహ్మస్త్ర సినిమాలో హీరో రణ్ బీర్ సింగ్ ఒక ఆయుధం ఉపయోగిస్తాడు. అదే ఆయుధం చుట్టూ నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే సినిమాలో ఒక ఎపిసోడ్ రాసుకున్నాడట. అయితే ఇప్పుడు ఈ విషయం తెలిసిన వెంటనే ఆ ఎపిసోడ్ మొత్తం తొలగించేందుకు నాగ్ అశ్విన్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. 500 కోట్లతో రూపొందిస్తున్న ఈ సినిమా ముందుగా అనుకున్నట్లు కాకుండా మళ్లీ మార్చాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది ఎలా తయారవుతుందోనని అభిమానులు ఒకింత భయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ‘ ఆ సినిమా ఆపేయి అన్నా .. నీకు దండం పెడతాం ‘ అని ప్రభాస్‌కు ఫ్యాన్స్ మొర పెట్టుకుంటున్నారు !
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం `కార్తికేయ 2`. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ…
ఆద్యంతం ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కట్టిపడేసిన దృశ్యం, దృశ్యం-2 సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ విభిన్న…
మానవుని శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా చాలా ముఖ్యమైనదే అని చెప్పడంలో. ఏ మాత్రం అతిశయోక్తి లేదనే చెప్పాలి.ముఖ్యంగా మానవుని శరీరంలో కిడ్నీలు ప్రధాన పాత్ర…
`భీష్మ` తర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతున్న యంగ్ హీరో నితిన్.. రీసెంట్గా `మాచర్ల నియోజకవర్గం`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై…
ఇటు సోషల్ మీడియా, అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గత కొద్ది రోజులుగా నరేష్, పవిత్ర లోకేష్ ల రిలేషన్ షిప్ వార్తలు హల్ చల్…
టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…