న్యూస్ సినిమా

Prabhas: రాజమౌళి ఫార్ములా ఫాలో అవుతున్న ప్రభాస్..?

Prabhas following Rajamouli plan
Share

Prabhas: దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో చాలా భారీ చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. సంక్రాంతికి కి థియేటర్లలో ‘ఆర్.ఆర్.ఆర్’, ‘రాధేశ్యామ్’ రిలీజ్ అవుతాయి అని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశ మిగిల్చాయి. ‘బాహుబలి’ వంటి సంచలన చిత్రాన్ని మనకు అందించిన రాజమౌళి ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా రిలీజ్ కోసం యావత్ సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

Prabhas following Rajamouli plan

ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ – పాన్ ఇండియా స్థాయిలో రూపొందించిన ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. యూరోప్ నేపథ్యంలో ఒక వింటేజ్ ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ఇటీవలే విడుదల చేసిన టీజర్ లో డావిన్సి ఓడని తలపించే ఓడ ప్రమాదం, ఇటలీ రైల్ మిస్సింగ్ ని తలపించే ట్రైన్ ఎపిసోడ్, డెస్టినీ ప్రేమల సమాహారంగా ఈ చిత్రాన్ని మలచిన తీరు సినిమాపై భారీ అంచనాలను పెంచింది.

జనవరి 14 న విడుదల కావాల్సిన ఈ మూవీ, కరోనా వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇవే కారణాలతో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం వాయిదా వేసిన మేకర్స్, ఈ చిత్రం రిలీజ్ కోసం రెండు డేట్లు మార్చ్ 18 లేదా ఏప్రిల్ 28 న విడుదల చేస్తామంటూ ఇటీవలే ప్రకటించారు. ఇదే తరహాలో ‘రాధేశ్యామ్’ మూవీ మేకర్స్ రెండు రిలీజ్ డేట్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు.

మార్చి ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ రిలీజ్ చేయాలని లేకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని విశ్వసనీయ సమాచారం. ‘ఆర్.ఆర్.ఆర్’ కంటే ముందే ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయాలని ‘రాదేశ్యామ్’ నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తున్నారట.

గత కొంత కాలంగా ఓ.టి.టి లో రిలీజ్ అవుతుంది అంటూ పుకార్లు వినిపించాయి. దీంతో దర్శకుడు రాధాకృష్ణ ఇటీవల ట్విట్టర్లో పేర్కొన్నారు ‘రాధేశ్యామ్’ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందని. అలానే రాధేశ్యాం సినిమాకి కూడా 2 రిలీజ్ డేట్లు ఇస్తున్నారు అని వినిపించడంతో ,రాజమౌళి ఫార్ములానే ప్రభాస్ కూడా ఫాలో అవుతున్నాడని సినీ వర్గాలు అనుకుంటున్నారు.


Share

Related posts

రఘురామకృష్ణంరాజు సస్పెన్షన్ కు సర్వం సిద్ధం?

Yandamuri

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ సండే స్పెషల్ స్టోరీ..!? నెక్స్ట్ వీక్ జరిగేది ఇదేనా..!?

bharani jella

Navy: ఫ్రీగా బీటెక్ చదివి.. నేవీ లో ఉద్యోగం పొందండి..!! 

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar