ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని పెంచిన సినిమా ‘బాహుబలి’ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అంతర్జాతీయ సినిమా పరిశ్రమలో మాట్లాడుకోవాల్సి వస్తే బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకునే వారు. కానీ ఎప్పుడైతే ‘బాహుబలి’ రిలీజ్ అయ్యిందో రాజమౌళి గురించి అదేవిధంగా సినీ హీరో ప్రభాస్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాటు అంతర్జాతీయ స్థాయిలో అనేక భాషల్లో రిలీజ్ అయిన ‘బాహుబలి’, చాలా రికార్డులను క్రియేట్ చేసింది. అంతే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను కూడా అందుకోవడం జరిగింది.
ఇదిలా ఉండగా లాక్ డౌన్ టైమ్ లో రష్యా దేశం లో టీవీలో రిలీజ్ అయిన ఈ సినిమా కి రష్యన్లు ఫిదా అయిపోయారు. సినిమా చూసి ‘బాహుబలి’ టీం పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దీంతో రష్యాలో సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ప్రభాస్ ‘రష్యన్ ఆడియన్స్ హార్ట్’ అవార్డుకు ఎంపికయ్యారు. లెజండరీ యాక్టర్ రాజ్ కపూర్, దాదాపు 30ఏళ్ల క్రితం ఇదే అవార్డును అందుకోగా, తర్వాతి కాలంలో ఇండియన్ యాక్టర్స్ లో ఏ నటుడికి ఆ గుర్తింపు దక్కలేదు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నటుడు ప్రభాస్ కి ఈ అవార్డు రావటం విశేషం. ప్రభాస్ కి రష్యన్ అవార్డు రావడంతో అభిమానులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.