Bigg Boss 5 Telugu: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు సినిమాలో.. మెయిన్ హీరోయిన్ త్రిష తో పాటు.. కన్నడ భామ సంజన కూడా నటించిన సంగతి తెలిసిందే. సంజన టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసినా గాని.. బుజ్జిగాడు సినిమాతోనే బాగా గుర్తింపు రావడం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియా వేదికగా.. బిగ్ బాస్ హౌస్ లో ట్రాన్స్జెండర్ కంటెస్టెంట్ గా రాణిస్తున్న.. ప్రియాంక సింగ్ కి తన సపోర్ట్ ఇస్తూ పోస్టు పెట్టింది. సంజనా పెట్టిన పోస్ట్ ఈ విధంగా ఉంది.
” ఎప్పుడూ అబ్బాయిలు లేదా అమ్మాయిలే షోలో గెలుస్తారు. కానీ ఈసారి ఒక మార్పు తీసుకొద్దాం. ట్రాన్స్జెండర్స్ ఎప్పుడూ వాళ్ల జీవితం కోసం ప్రతిరోజు పోరాడుతూనే ఉంటారు. వాళ్ల మీద ఎప్పుడూ నాకు చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అందుకే ప్రియాంక సింగ్ కోసం ప్రేమగా ఈ వీడియో చేస్తున్నాను. ఆమెకు ఎక్కువ ఓట్లు వేసి గెలిపించండి’ అంటూ సంజన.. సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
కన్నడ ఇండస్ట్రీకి చెందిన అంజన బిగ్ బాస్ షోలో.. ఒక ట్రాన్స్ జెండర్ కి.. సపోర్ట్ చేయటం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బిగ్బాస్ ఆడియన్స్ కూడా.. సంజన ఇచ్చిన సపోర్ట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ లిస్ట్ లో ..ఉమాదేవి, కాజల్, ప్రియ,నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబోలతో పాటు ప్రియాంక సింగ్ కూడా ఉండటం జరిగింది. మళ్లీ వారం ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చూడాలి.