2022 వరకు ప్రభాస్ ఖాళీ లేడు.. మరి ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయింది ..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యాం కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా దాదాపు చివరి దశకి చేరుకుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా సమ్మర్ కి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక జనవరి నుంచి ఆదిపురుష్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ కంప్లీట్ అవుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే.

Radhe Shyam teaser: Prabhas promises a timeless love story | Entertainment News,The Indian Express

కాగా ఈ సినిమాతో పాటు వైజయంతి మూవీస్ నిర్మించే సినిమాలోనూ ప్రభాస్ నటించబోతున్న సంగతి తెలిసిందే. మాహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె హీరోయిన్ గా నటించబోతుండగా బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర లో కనిపించబోతున్నాడు. ఇలా రాధే శ్యాం తర్వాత ప్రభాస్ రెండు ప్రాజెక్ట్ తో 2022 వరకు ఖాళ్ళీ లేడని సమాచారం.

Om Raut on casting Prabhas as Lord Ram in Adipurush: He is perfect for the role | Entertainment News,The Indian Express

ఇక ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్ కూడా మేకర్స్ అఫీషియల్ గా 2022 ఆగస్టు 11 న కూడా వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ – ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక భారీ పాన్ ఇండియా మూవీ రానుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ కి ప్రశాంత్ కథ కూడా వినిపించాడని.. ఆ కథ ప్రభాస్ కి బాగా నచ్చడంతో ఒకే చెప్పాడని అంటున్నారు. ఈ సినిమా’కేజీఎఫ్’ చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ నిర్మించబోతున్నారని అంటున్నారు. మరి అదే నిజమైతే ఈ ప్రాజెక్ట్ ఎలా సెట్ అయిందన్నది తెలియాల్సి ఉంది. ఇక 2022 తర్వాత ఈ సినిమా మొదలవుతుందా లేక ఇంకా ముందే మొదలవుతుందా చూడాలి.