Prabhas : ప్రభాస్ Prabhas సలార్ తాజాగా సెట్స్ మీదకి వచ్చేసింది. గత కొన్ని నెలలుగా సలార్ గురించే అందరిలోనూ ఆసక్తికరమైన చర్చలు సాగాయి. ఈ సినిమా కథా నేపథ్యం ఏంటీ .. ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నాడు.. పాన్ ఇండియన్ స్టార్ తో తీయబోయే సలార్ ఏ తరహా సినిమా.. ఇలా రక రకాల ప్రశ్నలు ఇండస్ట్రీ వర్గాలలో మొదలయ్యాయి. కాగా రీసెంట్ గా ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకి సంబంధించి సాలీడ్ అప్డేట్స్ ఇస్తూ సర్ప్రైజ్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రకటించారు చిత్ర యూనిట్.
కాగా తాజాగా సలార్ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వచ్చారు. రామగుండం మైన్స్ లో షూటింగ్ ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్స్ సీన్ ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. అంతేకాదు పదిరోజులు పాటూ ఈ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తారట. దాదాపు ఈ యాక్షన్స్ సీక్వెన్స్ 15 నిముషాలు ఉంటుందని.. సలార్ లో ఇది ప్రభాస్ ఎంట్రీ భారీ యాక్షన్స్ సీక్వెన్స్ అని సమాచారం. ఈ ఒక్క యాక్షన్ సీన్ కోసమే నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారట. ఇక యాక్షన్ సీన్స్ ని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడో ఇప్పటికే కేజీఎఫ్ 1 తో పాటు తాజాగా కేజీఎఫ్ 2 టీజర్ లో కూడా చూపించాడు.
Prabhas : ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్స్ సీన్స్ లో శృతి హాసన్ కూడా ఉంటుందా ..?
అయితే సలార్ లో ప్రభాస్ మీద తెరకెక్కించే యాక్షన్ సీన్స్ కేజీఎఫ్ సినిమాలకంటే నాలుగు రెట్లు ఉండేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడట. ఒకరకంగా ప్రభాస్ ని హాలీవుడ్ హీరోలా చూపించబోతున్నాడని సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం సలార్ యాక్షన్ సీన్స్ తో పాటు ప్రభాస్ – హీరోయిన్ శృతిహాసన్ కి సంబంధించిన సీన్స్ ని తెరకెక్కించబోతున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అయితే ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్స్ సీన్స్ లో శృతి హాసన్ కూడా ఉంటుందా లేక ప్రభాస్ – శృతిహాసన్ మీద తీసే సీన్స్ వేరేనా అన్నది సస్పెన్స్ గా ఉంది.