Prabhas: భారతదేశపు మొట్టమొదటి ఇండియా హీరో ప్రభాస్ పెళ్లి టాపిక్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తన తోటి హీరోలు అందరూ పెళ్లి చేసుకుని భార్యా ఉంటే ప్రభాస్ మాత్రం ఇంకా బ్రహ్మచర్యం ఆస్వాదిస్తున్నాడు. అయితే రాబోయే సంవత్సరంలో ప్రభాస్ పెళ్లి ఖాయంగా కనిపిస్తుంది. అప్పటికీ ఇన్ని సంవత్సరాలు అసలు అతను పెళ్ళి పైన ఎందుకు ఆసక్తి చూపలేదు అని సందేహం ఉంది. వీటన్నిటికీ ఇక ఫుల్ స్టాప్ పడినట్లే కనిపిస్తోంది.
విషయం ఏమిటంటే… రాధే శ్యామ్ ట్రైలర్ లో పూజా హెగ్డే… “ప్రేమ విషయంలో ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు” అని ఒక డైలాగ్ అంటుంది. ఇక ఇదే డైలాగ్ ని ఒక విలేఖరి ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రభాస్ ను… ఇంతకీ ప్రేమ విషయంలో మీ ప్రెడిక్షన్ ఎలా ఉంటుంది అని ప్రశ్నించాడు. అందుకు ప్రభాస్ సమాధానంగా చాలాసార్లు ప్రేమ విషయంలో నా అంచనాలు తప్పాయి… అందుకే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు అని బదులు ఇవ్వడం విశేషం.
ఇక అంతే… సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా తమ హీరో లవ్ ఫెయిల్యూర్ కాబట్టి అతనికి పెళ్లి చేసుకునేందుకు ఇన్ని సంవత్సరాలు పట్టింది అని మాట్లాడుకుంటున్నారు. “చాలాసార్లు నా అంచనాలు తప్పాయి” అన్నమాట అతను ఎన్నో సందర్భాల్లో ప్రేమలో పడ్డాడు అంటూ ఊహాగానాలు మొదలు పెట్టేశారు. అయితే ప్రభాస్ తీరు చూస్తుంటే బాహుబలి లాంటి పెద్ద సినిమాలకి, స్నేహితులకి తన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాడు. ఇక అతనికి ప్రేమ గొడవలో పడే సమయం ఎక్కడిది? మరి ప్రభాస్ లవ్ ఫెయిల్యూర్ మ్యాటర్ పై మరింత స్పష్టత మాత్రం అతను ఖచ్చితంగా నోరు తెరిస్తే కానీ తేలే విషయం కాదు.