Prabhas Marriage : ప్రభాస్ సినిమాల సంగతి గురించి అందరికీ తెలిసిందే. ఓ సాధారణమైన హీరో నుండి అసాధారణ స్థాయికి చేరుకొనే ప్రభాస్ ప్రయాణం మనం చూశాం. డార్లింగ్ తాజా సినిమా అయినటువంటి ‘రాధే శ్యామ్’ విడుదల ఇప్పటికీ పలుమార్లు వాయిదా పడినప్పటికీ ఎట్టకేలకు ఈ నెల 11న విడుదలకు సిద్ధ పడింది. ఈ క్రమంలో మూవీ టీమ్ నిన్నటి నుండే ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రభాస్‌కు తాజాగా ఓ డిఫరెంట్ ప్రశ్న ఎదురయ్యింది.
Prabhas Marriage : ఎక్కడ ఆ ఈవెంట్?
‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆల్రెడీ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసినదే. ఇక ఆ ఈవెంట్ సమయంలోనే ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ పోస్ట్‌పోన్ కావడంతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు రాధే శ్యామ్ నుండి రిలీజ్ ట్రైలర్ అంటూ మరో ట్రైలర్ విడుదల అయ్యి ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోంది. ఇక ఈ రాధే శ్యామ్ హిందీ రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ కోసం మూవీ టీమ్ అంతా ముంబాయికు వెళ్లారు. ముంబాయిలో రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరుగుతోంది.
ఏమిటా ప్రశ్న?
ఇకపోతే ఈ ఈవెంట్ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ప్రభాస్‌ను ఇరకాటంలో పెట్టే ప్రశ్న వేశారు. రాధే శ్యామ్ రిలీజ్ ట్రైలర్లో “ప్రేమ గురించి ఆదిత్య ప్రిడిక్షన్ తప్పు” అనే డైలాగ్ గమనించే వుంటారు. దాన్ని ఉద్దేశించి, సదరు విలేఖరి ‘అయితే మీ రియల్ లైఫ్‌లో కూడా అలా ఎప్పుడైనా ప్రిడిక్షన్ తప్పు అయ్యిందా? అని అడిగారు. దానికి ప్రభాస్.. ‘చాలాసార్లు అయ్యింది. అందుకే నాకింకా పెళ్లి కాలేదు.. అనుకుంటా!’ అని సమాధానం ఇచ్చాడు. దాంతో ఈ మాట ఇపుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.