పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సషనల్ మూవీ ‘కెజిఫ్’, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తదుపరి సినిమా లో నటించనున్నారు. ‘కె.జి.యఫ్’ సినిమా ను నిర్మించిన అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ ఈ పాన్ ఇండియా సినిమానూ నిర్మించనుంది. ఈ ప్రొడక్షన్ హౌస్ లో కెజిఫ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇది పాన్ ఇండియా నిర్మాణ సంస్థగా పేరు పొందింది. అందరూ కెజిఫ్ 2 కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సమయములో ప్రభాస్తో ‘సలార్’ సినిమాను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్.
ఈ పాన్ ఇండియా మూవీకి ‘సలార్’ అనే టైటిల్ను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఈ రోజు సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. సలార్ లోని ప్రభాస్ లుక్ను సైతం ఈ రోజు విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో ప్రభాస్ లుక్ చాలా డిఫరెంట్గా ఉండడం ప్రభాస్ ఫాన్స్ కి ఒక పండుగ లాగా ఉంది. గుబురుగా మీసాలతో, గన్ను నిటారుగా నిలబెట్టి దానిపై చేయి ఆన్చి అలా కూర్చుని ఉన్న ప్రభాస్ పోస్టర్ నెట్టింట హల్చల్ చేస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?