Prabhas: బాహుబలి బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. బాహుబలి రాకముందు వరకు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ప్రస్తుతం ఆలిండియా అదే రీతిలో ఇతర దేశాలలో కూడా పాపులారిటీ దక్కించుకోవడం జరిగింది. ప్రభాస్ తో సినిమా అంటే ఆ ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా చాలా మంది టాప్ డైరెక్టర్లు క్యూ కట్టే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.
ప్రభాస్ ఒప్పుకుంటే భారీ ఎత్తున రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా టాప్ నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ప్రభాస్ కి పూర్తిగా మారిపోయింది. ఆ రీతిగా ప్రభాస్ రేంజ్ అది తెలుగు హీరో గా.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులు మొత్తం తిరగరాసి.. సరికొత్త చరిత్ర సృష్టించడంతో మనోడి పేరు డబల్ త్రిబుల్ గా వినబడుతుంది. పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో మా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. లోకల్.. నాన్ లోకల్ అనే ఇష్యూ… ఇండస్ట్రీలో నెలకొనటంతో ప్రకాష్ రాజ్.. ఇక్కడ వాడు కాదని.. ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉండటంతో బండ్లగణేష్ కౌంటర్లు ఇస్తూ.. ఇటీవల సంచలన కామెంట్ చేశారు.
Read more: Prabhas: కమెడియన్ ఆలీ కోసం ముందుకు వస్తున్నా ప్రభాస్..!!
ఈ క్రమంలో ప్రభాస్ ఎక్కడ పుట్టాడు..? కానీ ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ నీ రూల్ చేస్తున్నాడు. అదే రీతిలో దిగ్గజ దర్శకుడు రాజమౌళిని తమ ఇండస్ట్రీలో సినిమాలు చేయాలని హాలీవుడ్ సైతం ఆహ్వానాలు పంపుతుంది. అలాంటప్పుడు లోకల్.. నాన్ లోకల్ వివాదం దేనికి..?, మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం, మా ఎన్నికలు.. కుటుంబానికి చెందినవి దీన్ని అడ్డం పెట్టుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఇండస్ట్రీకి మంచిది కాదు అంటూ బండ్ల గణేష్ తాజాగా ప్రభాస్ సత్తా గురించి.. మా అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రభాస్ ఫాన్స్ కాలర్ ఎగరేసే రీతిలో కామెంట్లు చేశారు. ప్రకాష్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించిన క్రమంలో.. బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!