బాహుబలి సినిమా హిట్ తో దేశవ్యాప్తంగా Prabhas క్రేజ్ సంపాదించడం అందరికీ తెలిసిందే. బాహుబలి విజయంతో మార్కెట్ పెంచుకోవడమే కాక పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ మారి పోవడం జరిగింది. ఎలాంటి సినిమా ఒప్పుకున్న గాని అన్ని భాషల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ప్రభాస్ సినిమాలు చేస్తూ ఉన్నారు.
ఈ క్రమంలో చేస్తున్న “రాధేశ్యామ్” సినిమాని ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” అనే సినిమా లైన్ లో ఇటీవల పెట్టడం అందరికీ తెలిసిందే. ఊర మాస్ లెవెల్ లో “సలార్” లో ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందని డైరెక్టర్ చెప్పటంతో సినిమాపై భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అయ్యింది.
ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లో ప్రభాస్ సరికొత్త ఫీట్ అడ్డుకున్నట్లు టాక్. వాస్తవానికి సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని ప్రభాస్ కి ఇంస్టాగ్రామ్ లో 6 మిలియన్స్ ఫాలోయర్స్ క్రాస్ అయ్యాడు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో 6 మిలియన్స్ ఫాలోయర్స్ కలిగిన లిస్టులో చేరిపోయాడు. దీంతో ఈ వార్త తెలుసుకుని డార్లింగ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రెండు సంవత్సరాల పాటు సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉండటంతో.. ఆయన పెళ్లి ఎప్పుడు అవుతుంది అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది.