Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన తరువాత ప్రభాస్ రేంజే ఊహించని విధంగా పెరిగిపోతుంది. బాహుబలి సినిమా రాకముందు వరకు కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ మార్కెట్ నీ దృష్టిలో పెట్టుకొని ప్రభాస్ సినిమాలు ఒకే చేయటం జరిగేది. కానీ బాహుబలి సినిమా తో ఊహించని రీతిలో కేవలం దేశంలో మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో.. ప్రభాస్ మార్కెట్ విస్తరించడంతో.. చాలావరకు ప్రభాస్ అంతర్జాతీయస్థాయి సినిమా ప్రేక్షకుల ఆలోచనల మేరకు సినిమాలు ప్రస్తుతం ఓకే చేస్తున్నట్లు అర్థమవుతోంది.
ఈ తరహాలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించబోయే సినిమా ఉంటుందని ఇప్పటికే వార్తలు రావడం మనం విన్నాం. ఇదిలావుంటే ఇటీవల తెలుగులో ఓ టాప్ డైరెక్టర్ ప్రభాస్ కోసం డిటెక్టివ్ పాత్ర కలిగిన సినిమా.. స్టోరీ వినిపించినట్లు ప్రభాస్ కూడా ఓకే అన్నట్లు వార్తలు వస్తున్నాయి. జేమ్స్ బాండ్ మాదిరిగా డిటెక్టివ్ పాత్రలో ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ వుండునట్లు హై బడ్జెట్ మూవీ అన్నట్లు టాక్.
Read more: Prabhas: మరోసారి ప్రభాస్ తో జతకట్టనున్న కాజల్ అగర్వాల్..??
ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యాం, సలార్, ఆది పురుష్ సినిమాలు చేస్తున్నారు. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఈ ప్రాజెక్టు తో పాటు మరో పక్క.. అంతా ఓకే అయితే ఈ డిటెక్టివ్ సినిమా కూడా చేయాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో సరిగ్గా ప్రభాస్ ఫిజిక్ కి డిటెక్టివ్ పాత్ర సూట్ అయిపోతుందని ఫ్యాన్స్ అంటున్నారు.