Prabhas: “కేజిఎఫ్” లాంటి మాస్ బ్లాక్ బస్టర్ సినిమా తీసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. దేశవ్యాప్తంగా మాస్ లో మంచి పాపులారిటీ ఉన్న హీరో ప్రభాస్ తో సినిమా చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న “సలార్” సినిమా కోసం.. ఇండియన్ ఫిలిం లవర్స్ ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. సినిమా లో ఎవరూ ఊహించని రీతిలో ప్రభాస్ క్యారెక్టర్ ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ మాఫియా లీడర్ పాత్రా చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు రావడం మనం చూశాం. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ షర్టు లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నట్లు కూడా ఇటీవల ఫిలిం నగర్లో టాక్ వచ్చింది. పరిస్థితి ఇలా ఉండగా సినిమాలో ప్రభాస్ మేకోవర్ కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు తాజాగా వినబడుతున్నాయి.
Read more: Prabhas: ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసే లా సెన్సేషనల్ డైలాగ్ వేసిన బండ్ల గణేష్..!!
మేటర్ లోకి వెళ్తే సినిమాలో ప్రభాస్ హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ గా చూపించాలని అని అందుకోసం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలకు పనిచేసే హెయిర్ స్టైలిస్ట్ నీ ప్రశాంత్ నీల్.. “సలార్” కోసం రంగంలోకి దింపినట్లు.. లేటెస్ట్ టాక్ వినపడుతోంది. దాదాపు ఆ హైర్ స్టైలిస్ట్ కోసం కొన్ని లక్షలు ఖర్చు పెట్టడానికి డీల్ కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు ప్రభాస్ లుక్ ఎన్నడూ చూడని రీతిలో ఈ సినిమాలో చూపించాలని డైరెక్టర్ డిసైడ్ అయ్యారట. ఈ సినిమాతో మరోసారి కేజిఎఫ్ లాంటి హీట్ పడాలని.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్… సినిమాలో ప్రతి సన్నివేశం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు.. మరో బాహుబలి అనే రీతిలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ బాక్స్ఆఫీస్ షేక్ చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!