Prabhas : ప్రభాస్ రాధే శ్యామ్ నుంచి 3 సర్‌ప్రైజెస్ వచ్చేది ఆరోజే..!

Share

Prabhas : జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడికల్ మూవీ రాధే శ్యామ్. యూవీ క్రియేషన్స్ 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ అద్బుతంగా ఉందని ఇప్పటికే విక్రమాదిత్య పోస్టర్‌తోనే హింట్ ఇచ్చారు మేకర్స్. పీరియాడికల్ మూవీ అయినప్పటికీ ప్రభాస్ ను చాలా స్టైలిష్ గా చూపించడానికి రాధాకృష్ణ ఎంత కేర్ తీసుకున్నాడో ఆయన లుక్స్ చూస్తేనే తెలుస్తోంది. ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రభాస్ పెదానాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు – భాగ్యశ్రీ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.

prabhas-radhae-shyam-3-surprises-are-going to be released-on-that-day
prabhas-radhae-shyam-3-surprises-are-going to be released-on-that-day

కాగా ఈ సినిమా 2022 సంక్రాంతి బరిలో దింపబోతున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే సెప్టెంబర్ నుంచి నెమ్మదిగా రాధే శ్యామ్ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం. అంతేకాదు అక్టోబర్ నెలలో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయడం పక్కా అంటున్నారు. అంతేకాదు రాధే శ్యామ్ ప్రమోషన్స్ అప్పటి నుంచి బాగా స్పీడప్ చేయనున్నారట.

Prabhas : వాటికి మించి మరో స్థాయిలో ఉండేలా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

ఇక రాధే శ్యామ్ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్ లకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ప్రభాస్ బర్త్ డే సందర్బంగా వెల్లడించనున్నారు. ఈ మధ్య అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా వారి చిత్రాల నుంచి సర్‌ప్రజింగ్ అప్‌డేట్స్ ఇచ్చి ఖుషీ చేశారు. వాటికి మించి మరో స్థాయిలో ఉండేలా ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. చూడాలి మరి మన పాన్ ఇండియన్ స్టార్ ఏ రేంజ్‌లో సర్‌ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నాడో.


Share

Related posts

ఉగ్రవాదుల కాల్పులు: ఇద్దరు జవానులు మృతి

somaraju sharma

చిరు, చ‌ర‌ణ్‌ల‌కు ధ‌న్య‌వాదాలు:అనుష్క‌

Siva Prasad

 రాశి ఫలాలు 12 జూన్ 2020 దిన ఫలాలు – ఈ రోజు మీ  రాశి ఫలితం ఎలా ఉండబోతోంది……..

Kumar