Prabhas: మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నెమ్మదిగా తను నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్ సినిమా ప్రమోషన్స్‌ను మొదలు పెట్టాడు. ఇన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న డార్లింగ్ ఒకేసారి ఇటు టాలీవుడ్లో అటు బాలీవుడ్లో సమాంతరంగా ప్రమోషనల్ కార్యక్రమాలను ప్లాన్ చేశారు. ఇటీవల తెలుగులో ఫస్ట్ సింగిల్ ఈ రాతలే అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి మెలోడియస్గా సాగిన ఈ రాతలే సాంగ్ రాధే శ్యామ్ కథా నేపథ్యాన్ని తెలియజేసింది. పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరిగా వస్తున్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరచింది.
అయితే బాలీవుడ్లో రాధే శ్యామ్ సినిమాను పట్టించుకోవడం లేదని కామెంట్స్ వినిపించాయి. తాజాగా ఈ సినిమా నుంచి హిందీ వెర్షన్ సాంగ్ ఆషికీ ఆగయీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా అన్నీ భాషలలోని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఫారిన్ లొకేషన్స్‌లో చిత్రీకరించిన ఈ సాంగ్ మంచి విజువల్ ట్రీట్‌గా అనిపిస్తోంది. ఇదే సమయంలో తెలుగు వెర్షన్‌తో పాటు మిగతా సౌత్ భాషలలో సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.
Prabhas: ఒమిక్రాన్ ఎఫెక్ట్ ‘రాధే శ్యామ్’ మీద పడుతుందా
నగుమోమూ తారలే అనే సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమాతో ప్రభాస్ మ్యూజిక్ పరంగా పెద్ద సాహసం చేస్తున్నారు. తెలుగుతో పాటు సౌత్ భాషలలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా, హిందీ వెర్షన్‌కు మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. హిందీలో ఒక వేరియేషన్లో సౌత్ భాషలలో ఒక వేరియేషన్లో ఈ సాంగ్స్ ఉండబోతున్నాయి. 2022, సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ జానున్న రాధే శ్యామ్ సినిమా మీద అన్నీ భాషలలో భారీ అంచనాలున్నాయి. మొత్తం 7 భాషలలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకుంటుందో చూడాలి. ఇక కొత్తగా వచ్చిన కరోనా వైరస్ ప్రభావం మళ్ళీ మొదలైంది. దీని ఎఫెక్ట్ రాధే శ్యామ్ మీద పడుతుందా అనేది ఇప్పుడు కొత్త టాక్.