Prabhas : ప్రస్తుతం ప్రభాస్ జీవితం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది అనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ లేదు. వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ మరో ప్రాజెక్ట్ కు సైన్ చేయనున్నాడని నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయడానికి రెడీగా ఉన్నారని.. RRR ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య మరియు ‘ఆచార్య’ నిర్మాత నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని ప్రధానంగా వినిపిస్తోంది.
Prabhas : ఈ సినిమా హీరోయిన్ ఎవరో తెలుసా?
ఇకపోతే, ఈ సినిమా హారర్ కామెడీ జానర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని వినికిడి. ఇక దీనికి ‘రాజా డీలక్స్’ అనే క్యాచీ టైటిల్ పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ప్రభాస్ – మారుతి వంటి అరుదైన కాంబినేషన్ పేరు వినగానే సినీ అభిమానులు ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారు. ఇప్పటి వరకు ఏ పెద్ద హీరోని హ్యాండిల్ చేయని మారుతీతో ప్రభాస్ ఎలా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని డార్లింగ్ ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఇందులో ప్రముఖ బాలీవుడ్ అందాల తార అయినటువంటి ప్రియాంక చోప్రా నటించనుందట.
దర్శకుడు మారుతి రియాక్షన్ ఇదే..
ఈ క్రమంలో వస్తున్న వార్తలపై మారుతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ”నా ఫ్యూచర్ ప్రాజెక్ట్లు – టైటిల్స్ – జానర్లు – మ్యూజిక్ డైరెక్టర్స్ మరియు సిబ్బంది.. మొదలైన వాటి గురించి చాలా ఊహాగానాలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. కానీ కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. మీ మద్దతు మరియు ప్రోత్సాహానికి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉండండి.. మాస్క్ ధరించి సురక్షితంగా ఉండండి” అని మారుతి ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే మారుతి ట్వీట్ ప్రభాస్ తో సినిమాపై క్లారిటీ ఇవ్వకపోవడం కొసమెరుపు.