కేజిఎఫ్ సినిమా దర్శకుడు ప్రశాంత నీల్ తో రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ అనే సినిమా చేస్తున్నాడు అన్న వార్త వచ్చిన తర్వాత నుంచి ఆ కాంబో ఈ పైన దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఛత్రపతి సినిమాతో స్టార్ హీరో రేంజ్ అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత మళ్ళీ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అప్పుడు రాజమౌళి ఛత్రపత్రి చిత్రం సినిమాతో ప్రభాస్ రేంజ్ మార్చేశాడు. ఇప్పుడు బాహుబలి తో దేశంలో ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో దేశవ్యాప్తంగా ప్రభాస్ రేంజ్ పెంచేశాడు.
అలాంటి ప్రభాస్ తో కేజిఎఫ్ ఎలివేషన్లు రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా చేస్తుండడంతో అభిమానులకు భారీస్థాయి అంచనాలు ఉన్నాయి. ఇక బాహుబలి చరిత్ర సృష్టించిన సినిమా అయినప్పటికీ రాజమౌళి ఛత్రపతి తో సృష్టించిన మ్యాజిక్ బాహుబలిలో కనిపించలేదు. ప్రభాస్ ఛత్రపతి తర్వాత అంతటి ఊర మాస్ రోల్ కూడా చేయలేదు. అయితే ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ అలాంటి మాస్ గెటప్ లో కనిపించబోతున్నాడు. అతని ఫ్యాన్స్ కు కూడా అదే కావాలి.
దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఈ సినిమా కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ‘సలార్’ కథ కూడా కేజిఎఫ్ లాగానే ఉంటుందని అందరూ అంటున్నారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ కేజిఎఫ్ కు ముందు ‘ఉగ్రం’ అనే సినిమా తీశాడు. అది అక్కడ అతి భారీ హిట్ సాధించింది. కేజిఎఫ్ సినిమా, ఉగ్రం మూలకథ ఒకటే. ఇక ఇప్పుడు సలార్ సినిమాకు సంబంధించిన కథ ఒకటి లీక్ అయింది.
Prabhas Salaar : మూల కథ
‘సలార్’ అంటే కమాండర్ ఇన్ చీఫ్ అని అర్థం. ఈ సినిమా లో గ్రూపులో కుడిభుజంగా ఉండేవాడు లీడర్ ఎలా అయ్యాడు అని చెప్పే కథ ఇది. ఇప్పటివరకు ప్రభాస్ ను ఎవరూ ఊహించని స్థాయిలో ఎంతో పవర్ఫుల్గా ప్రశాంత్ నీల్ చూపించబోతున్నాడు అని చెప్తున్నారు. ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ గా కనిపించబోయే ప్రభాస్…. దీనిలో రివెంజ్ డ్రామా కూడా ఉంటుందని తెలుస్తోంది.
అంతేకాదు ఈ సినిమాలో ముంబై మాఫియా ఉంటుందని ముంబై మాఫియా డాన్ గా ప్రభాస్ కనిపిస్తాడని అంటున్నారు. కే జి ఎఫ్ లో కూడా ముంబై మాఫియా ఉంటుంది. 2021 మార్చి నుంచి సలార్ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమా కోసం దాదాపు కొన్ని వందలకోట్ల బడ్జెట్ పెడుతున్నారు. అంతే కాకుండా సినిమాలో బాలీవుడ్ తారగణం కూడా ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?