ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు నిర్మాత కనీసం 300 కోట్లు బడ్జెటైనా కేటాయించాల్సిందే. పాన్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ రేంజ్ అండ్ క్రేజ్ అది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కోసం కొత్త కథలు సిద్దమవుతున్నాయి. ప్రతీ కథ భారీ తారాగణంతో తెరకెక్కుతున్నాయి. హాలీవుడ్ రేంజ్ సినిమా అంటే ఇప్పుడు టాలీవుడ్ లో ప్రభాస్ నటిస్తున్న సినిమాలే. హాలీవుడ్ సినిమా రేంజ్ కాబట్టే ప్రభాస్ తో తెర్కెక్కిస్తున్న సినిమాలలో బాలీవుడ్ సహా మిగతా భాషల్లో ఉన్న స్టార్ అండ్ క్రేజీ స్టార్స్ ని నటింప చేస్తున్నారు.
ఇప్పటికే ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వైజయంతీ మూవీస్ నిర్మించే భారీ పాన్ ఇండియన్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ని హీరోయిన్ గా .. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని కీలక పాత్రకోసం ఎంచుకున్నారు. ఈ సినిమాకి అమితాబ్ అందుకుంటున్న రెమ్యూనరేషన్ దాదాపు 20 కోట్లని అంటున్నారు. అంటే హీరోయిన్ గా నటించబోతున్న దీపిక పదుకొణె రెమ్యూనరేషన్ ఎంత ఉండొచ్చు… ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత ఉండొచ్చు. ఇదే ఇప్పుడు అన్ని సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
కాగా త్వరలో ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సెట్స్ మీదకి వెళ్ళబోతోంది. అయితే ఈ సినిమాలో ప్రభాస్ పెదనాన్న సీనియర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు నటించబోతున్నాడన్న టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అంతేకాదు ఈ మధ్య చిత్ర యూనిట్ సలార్ సినిమా కోసం కాస్టింగ్ ని ఫైనల్ చేస్తున్నారట. అందులో భాగంగా రానా, మోహన్ లాల్, విజయ్ సేతుపతి, అనుష్క శెట్టి పేర్లు ప్రచారం లో ఉన్నాయి. అంతేకాదు సలార్ లో నటించే నటులకి కూడా భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారని సమాచారం. అంతేకాదు సలార్ సినిమాకి సగం బడ్జెట్ రెమ్యూనరేషన్ కే కేటాయించినట్టు చెబుతున్నారు.