Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫిజిక్ మెయింటెన్ చేసే హీరోలలో ప్రభాస్, సుధీర్ బాబు ఇంకా చాలామంది ఉన్నారు. అందరిలో కెల్లా చాలా ప్రొఫెషనల్ గా బాడీ ని చాలా బాగా మెయింటెన్ చేసేది హీరో సుధీర్ బాబు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఎక్కడికక్కడ కట్టింగ్ లతో పాటు మంచి సైజు తో ఎక్కడికక్కడ మజిల్స్ .. కలిగిన బాడీ గా మెయింటెన్ చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉండే వాళ్ల కంటే చాలా ప్రొఫెషనల్ గా.. బాడీ ని సుధీర్ బాబు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అటువంటి సుధీర్ బాబు తాజాగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా భారీ ఎత్తున రిలీజ్ అయింది. ఆగస్టు 27 వ తారీఖు అనగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా కి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరగడం తెలిసిందే. ఈ క్రమంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో ఈ సినిమా యూనిట్ ఇంటర్వ్యూ తరహాలో కూర్చుని సినిమా విశేషాల గురించి మాట్లాడుకున్నారు. సినిమా రిలీజ్ కాక ముందు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభాస్.. సుధీర్ బాబు బాడీ గురించి.. ఈ కార్యక్రమంలో సెన్సేషనల్ కామెంట్లు చేశారు. సుధీర్ బాబు బాగా సెటిల్ ప్లేయర్ అంతా బాగానే ఉంది, కానీ ఆ బాడీ ఏంటి ఎలా వచ్చేసింది..?? ఆ గొడవ ఏంటి మాకు తెలియకుండా ఎలా వచ్చేసింది అంటూ ప్రభాస్ ఈ కార్యక్రమంలో సుధీర్ బాబు ని అడగటం జరిగింది. అయితే ప్రభాస్ చేసిన వ్యాఖ్యలకు ఎప్పటినుండో వర్కౌట్ చేయటమే అంటూ సుధీర్ బాబు తనదైన శైలిలో జవాబిచ్చారు.
ఎప్పటినుండో చేయటం వల్లే.. బాడీ ఈ మాదిరి షేప్ లు వచ్చినాయి అని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ షాట్ లో… బోటు నుండి షర్టు లేకుండా బాడీ చూపించిన షాట్ చాలా బాగుందని ప్రభాస్ ఈ సందర్భంగా.. చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న డైరెక్టర్ ఆ సన్నివేశం అమలాపురంలో తీయటం జరిగిందని ప్రతి ఏడాది అక్కడ బోటు పోటీలు.. జరుగుతాయని… అదే తరహాలో బోట్ రేస్ సినిమాలో ఉంటుందని… దానిలో భాగమే ఆ షాట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా హీరో సుధీర్ బాబు బాడీ గురించి ప్రభాస్.. శ్రీదేవి సోడా సెంటర్ ప్రమోషన్ కార్యక్రమంలో చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?