Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన తర్వాత ప్రభాస్ సిగ్గుగా యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలు చేస్తూ ఉన్నారు. అనేక ఇండస్ట్రీలో టాప్ దర్శకుడిగా పేరొందిన వారిని లైన్ లో పెడుతూ.. పాన్ ఇండియా స్క్రిప్ట్ లు ఓకే చేస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే “కేజీఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా “సలార్” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏ సినిమాకి సంబంధించి హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ దాదాపు 14 రోజులపాటు చిత్రీకరించడానికి డైరెక్టర్ రెడీ అవటం జరిగిందట.
ఈ యాక్షన్ ఎపిసోడ్ సీన్ సినిమాలో ఇంటర్వల్ టైం లో రానున్నట్లు… ఈ ఫైట్స్ చిత్రీకరించడానికి ప్రొఫెషనల్ కెమెరాలతో పాటు ప్రొఫెషనల్ ఫైటర్ లను కూడా విదేశాల నుండి దింపిన్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ఫైట్ సన్నివేశం హైదరాబాద్ లో ఓ ప్రముఖ ఫిలిం స్టూడియో లో చిత్రీకరించనున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్. ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమా రిలీజ్ అయి చాలాకాలం అవ్వటంతో.. త్వరలో రిలీజ్ కాబోతున్న రాధేశ్యాం సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
Read More: Salaar : సలార్ విషయంలో డైరెక్టర్‌కి రిక్వెస్ట్ చేస్తున్నారా ట్రోల్ చేస్తున్నారా..?
సినిమాలో చాలా కూల్ గా లవర్ బాయ్ తరహా లో ప్రభాస్ లుక్ ఉండటంతో.. “రాదేశ్యామ్” ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఉత్కంఠగా భావిస్తున్నారు. ఇదే తరుణంలో మరో పక్క బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో …”ఆది పురుష్” కూడా త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రభాస్ సన్నాహాలు చేస్తున్నారు. కరోనా కారణంగా లాంగ్ గ్యాప్ రావడంతో.. ఈసారి చేతిలో ఉన్న సినిమాలు మొత్తం త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రభాస్ రెడీ అయినట్లు సమాచారం.