Prabhas : ప్రభాస్ సలార్ అన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కేజీఎఫ్ సినిమాల తో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి అంతటి క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇక పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కుతున్న సలార్ మీద దేశ వ్యాప్తంగా విపరీతంగా క్రేజ్ నెలకొంది. రీసెంట్ గా సలార్ సెట్స్ మీదకి వచ్చింది. రామగుండం కోల్ మైన్స్ లో చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగనుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించబోతున్నారు.
కాగా ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తోంది. గత మూడేళ్ళుగా శృతిహాసన్ సినిమాలకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కాటమరాయుడు సినిమా తర్వాత మళ్ళీ శృతి హాసన్ తెలుగులో కనిపించలేదు. మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ తోనే సాలీడ్ హిట్ అందుకుంది. మూడేళ్ళ గ్యాప్ కి సరిపడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఫుల్ ఫాం లోకి వచ్చిది. దాంతో తెలుగులో వరసగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సలార్ లో అవకాశం దక్కించుకుంది.
Prabhas : శృతి హాసన్ కి ఉన్న క్రేజ్ తో మేకర్స్ కూడా ఒకే అన్నారట.
అయితే ఇప్పుడు ఈ సినిమాలో శృతి హాసన్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ పెద్ద హాట్ టాపిక్ గా మారింది. రీ ఎంట్రీ ఇచ్చి ఒక్క సినిమాతో భారీ హిట్ అందుకోవడంతో రెమ్యూనరేషన్ బాగా డిమాండ్ చేస్తుందని అంటున్నారు. సలార్ లో నటించేందుకు శృతి హాసన్ కోటి రూపాయలకు పైగా డిమాండ్ చేసిందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ కి ఉన్న క్రేజ్ తో మేకర్స్ కూడా ఒకే అన్నారట. దాంతో ప్రభాస్ సలార్ సినిమా కోసం ఈ బ్యూటీ బల్క్ డేట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా శృతి హాసన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతోంది.