Home: భూత బలిని ఇంటిలోనే ఆచరించడం వలన మీ ఇల్లే ఒక దేవాలయం అవుతుంది !!

Own house: సొంత ఇంటి కల నిజం కావడం లేదా?? అయితే ఇలా చేసి చూడండి !!!
Share

Home: ఇల్లే ఒక దేవాలయం
వేదాలుతెలియచేసిన దాని  ప్రకారం   భూత బలిని ఇంటిలోనే ఆచరించడం వలన మీ ఇల్లే ఒక దేవాలయం అవుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.సకల దేవతలు మీ ఇంటి ని రక్షిస్తూ ఉంటారు.ఎన్నో  జన్మల నుండి మిమ్మల్ని వెంటాడుతు  వస్తున్న పాప కర్మలన్నీ తొలగిపోతాయి.  భూత బలి అనేది మీకు అపారమైన పుణ్య బలాన్నిఇస్తుంది.   ఈ విధం గా  సంపాదించుకున్న పుణ్య బలం అక్షయమై జన్మ జన్మలకు మీ కష్టాలన్నీ తీరిపోయేలా, మీ కోరికలన్నీ నెరవేరేలా మిమ్మల్ని  అనుగ్రహిస్తుంది.

Home: భూత బలిని  చూసి ఈశ్వరుడు

మీరు భూత బలిని చాలా రకాలు గా  చేయవచ్చు.  మీరు దీనిని మొదట మంచి నీటితో మొదలు పెట్టండి.  మీ ఇంటి మెడమీద,ఆకాశ మార్గాన సంచరించే పక్షుల కొరకు ఒక మట్టి పాత్రలో కానీ ఏదైనా బరువైన పాత్రలో కానీ మంచి నీటిని పెట్టండి. ఈ విధం గానే నేలపై తిరిగే  జంతువుల కోసం  మీ ఇంటి ముందు ఒక సిమెంట్ తొట్టిలో  నీరు ఉండేలా  చేయడం వలన..మీ ఇంటి మీదగా వెళ్లే జంతువులు తమ  దాహాన్ని తిరుచుకుంటాయి. మీ ఇంటి వేలుపల శుభ్రమైన ప్రదేశంలో రోజూ మీకు వీలైన ఏదైనా ఆహారాన్ని  పెట్టండి.  కుక్కలు, పిల్లులు లేదా వేరే ఇతర జంతువులు ఏదైనా ఆ ఆహారాన్ని తీసుకుని వాటి  ఆకలి  తీర్చుకుంటాయి.కాకులు, పక్షులకు ఎతైన ప్రదేశంలో అవి తినే ఆహారాన్ని పెట్టండి.మీ ఇంటి వెలుపల ఆహారాన్నిపెట్టడానికి అవకాశం లేకపోతే,    మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ జంతువులకు, పక్షులకు, చీమలకు, క్రిమి కీటకాలకు ఆహారం అందే విధం గా చేయండి.   మీరు ఆహారాన్ని, మంచి నీటిని జంతువులకు, పక్షులకు, ఇతర జీవాలకు అందించడాన్ని ఒక దైవ కార్యంగా భావించి ఎంతో భక్తితో చేయండి.  మీరు ఇలా చేసే  భూత బలిని  చూసి ఈశ్వరుడు  ఎంతో సంతృప్తి చెంది, మీ పాప కర్మలను అన్నిటిని భస్మం చేసి, మీకు అపార పుణ్య బలాన్ని ప్రసాదిస్తాడు అని వేదాలు   తెలియచేస్తున్నాయి.

ఆహారాన్ని వృధా

ఈ విధంగా మీరు పొందే  పుణ్య బలం, మీ కష్టాలను తొలగించడం తో పాటు మీ ధర్మ బద్దమైన తీరని కోరికలను సైతం తీరుస్తుంది.
ఆవులు, కోతులు వంటి వాటికి కూడా అవి తినే ఆహారాన్ని మీకు కుదిరినప్పుడల్లా అందిస్తూ ఉండండి.   నిర్మానుష్యమైన ప్రదేశాలలో, చెట్ల పొదల్లో చీమలు మరియు క్రిమి కీటకాల కొరకు ఏదైనా ఆహారాన్ని  వేస్తూ ఉండండి.   ఆహారాన్ని వృధా చేయకుండా మిగిలిన  ఆహారాన్ని జంతువులు, పక్షులు, చీమలు, క్రిమి కీటకాలకు ఏదో ఒక రూపం లో  అందేలా చేస్తూఉండండి.


Share

Related posts

త్వరలోనే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిలకు బాడ్ న్యూస్!!

Naina

Tamannaah Bhatia Saree Photos

Gallery Desk

TRS : గులాబీ నేతల కనుసన్నల్లో ఖాకీలు!పెచ్చుమీరిన రాజకీయ పెత్తనం!!

Yandamuri