ప్రదీప్ నటించిన లేటెస్ట్ సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. కి మోక్షం కలిగింది. ఒకే ఒక్క సాంగ్ తో సంచలనం సృష్ఠించిన సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. హీరోగా pradeep డెబ్యూ సినిమా. ఇప్పటి వరకు బుల్లితెర మీద ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని క్రేజ్ సంపాదించుకున్న pradeep హీరోగా రాబోతున్నాడు. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయింది. స్టార్స్ నటించిన సినిమాలు కూడా ఓటీటీలో రిలీజయ్యాయి. కాని pradeep నటించిన లేటెస్ట్ సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మాత్రం థియేటర్స్ రిలీజ్ కోసమే ఆగారు.
కాగా ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా తాజాగా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరు కథ అద్భుతం అని ఖచ్చితంగా pradeep డెబ్యూ సినిమాతో హిట్ అందుకోబోతున్నాడని నమ్మకంగా చెబుతున్నారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా నుంచి రిలీజైన ‘నీలినీలి ఆకాశం’ అంటూ సాగే ఆ మెలోడీ సాంగ్ యూట్యూబ్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క సాంగ్ సినిమా మీద భారీ అంచనాలను పెంచేసింది.
ఇప్పుడు రిలీజైన ట్రైలర్ తో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక సుకుమార్ దగ్గర అసోసియేట్ గా చేసిన మున్నా దర్శకుడిగా పరిచయం అవుతుండగా అమృత అయ్యర్ ఈ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అనూప్ రుబెన్స్ సంగీతం అందించాడు. పునర్జన్మల నేపథ్యంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. సినిమా కథ రూపొందిందని తెలుస్తోంది. ఇలాంటి కథ తో pradeep హీరోగా ఎంట్రీ అంటే ఖచ్చితంగా సూపర్ హిట్ అందుకుంటాడని అందరూ భావిస్తున్నారు. ఇక సినిమాను యూవి క్రియేషన్స్, గీతాఆర్ట్స్ ఈ నెల 29న థియేట్రికల్ విడుదల చేయనున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?