ఏంటి.. సుధీర్ ను ప్రదీప్, హైపర్ ఆది అలా ఆడుకుంటున్నారు?

ఈటీవీలో ఢీ చాంపియన్స్ షో ప్రసారమవుతున్న విషయం తెలుసు కదా. ప్రస్తుతం ఢీ చాంపియన్స్ క్వార్టర్ ఫైనల్స్ ఎపిసోడ్స్ ప్రసారం అవుతున్నాయి. ఈ షోకు ప్రదీప్ యాంకర్. హైపర్ ఆది, వర్షిణిది ఒక జట్టు.. సుడిగాలి సుధీర్, రష్మీది ఇంకో జట్టు.

ప్రస్తుతం సుడిగాలి సుధీర్ కు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర మీద సుధీర్ కు ఉన్నంత డిమాండ్, పాపులారిటీ మరెవ్వరికీ లేదు. జబర్దస్త్ తో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సుధీర్.. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం హీరోగానూ సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు.

pradeep and hyper aadi satires on sudigali sudheer
pradeep and hyper aadi satires on sudigali sudheer

అయితే.. ఏ షోకు సుధీర్ వెళ్లినా.. సుధీర్ ను టార్గెట్ చేస్తూ.. సుధీర్ పై పంచ్ లు వేస్తుంటారు తోటి కమెడియన్లు. ఇది జబర్దస్త్ లోనూ జరుగుతుంది. వేరే షోలలోనూ జరుగుతుంది. దీనిపై సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ మాత్రం చాలా హర్ట్ అవుతున్నారు.

సుధీర్.. డౌన్ టూ ఎర్త్. ఆయన చాలా సింపుల్ గా ఉంటాడు. తనను ఎవరైనా ఏదైనా అన్నా కూడా లైట్ తీసుకుంటాడు. అదే ఆయనకు ప్రస్తుతం పెద్ద తలనొప్పిగా మారింది. దాన్ని అలుసుగా తీసుకొని.. కావాలని సుధీర్ పై లేనిపోని కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా విడుదలైన ఢీ చాంపియన్స్ ఎపిసోడ్ ప్రోమోలో కూడా అదే జరిగింది. తర్వాత ఎవరి పర్ ఫార్మెన్స్ ఉంటుంది.. అని యాంకర్ ప్రదీప్.. సుధీర్ ను అడగగా… తర్వాత మావోడు వస్తాడు.. అని సుధీర్ అంటాడు. జతిన్ అంటాడు. ఎప్పుడు వస్తున్నాడు.. అంటూ ప్రదీప్ సెటైర్ వేస్తాడు. దీంతో సుధీర్.. ఇప్పుడే వస్తున్నాడు అంటాడు. అయినా కూడా ప్రదీప్ కావాలని ఎంతసేపు పట్టొచ్చు.. అంటూ కౌంటర్ ఇస్తాడు. ఇంతలోనే హైపర్ ఆది అందుకొని.. జతిన్ వచ్చాడు.. అంటూ ఓ పిల్లాడిని చూపిస్తాడు. దీంతో ఆయన జతిన్ కాదు. గగన్ అంటాడు. అయినా కూడా వినకుండా.. ప్రదీప్, ఆది.. ఇద్దరూ సుధీర్ ను ఆటపట్టిస్తారు.

ఇలా.. ప్రతి సారి సుధీర్ ను కావాలని ఆటపట్టిస్తున్నారంటూ సుధీర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెట్ లో అందరూ చూస్తుండగా.. సుధీర్ పై ఇలా కౌంటర్లు వేయడం తమకు నచ్చడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.