Pradeep Machiraju: తాజాగా ప్రదీప్ మాచిరాజు మొదటి సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినెమా ఆ గురించి ప్రదీప్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.
ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద మేల్ యాంకర్స్ జాబితాలో ప్రదీప్ మాచిరాజు టాప్ లో ఉన్నాడు. ఒక్కో ఎపిసోడ్ కు లక్షలు లక్షలు రెమ్యునరేషన్ తీసుకునే ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై హీరోగా తన లక్ ను పరీక్షించుకున్నారు. ఈ చిత్రంలో అమృత అయ్యర్ ప్రదీప్ సరసన హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు.
అయితే, మనలో చాలా మందికి ప్రదీప్ ఈ సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అన్న సందేహం ఉంది. ఇదే విషయమై ప్రదీప్ స్పందిస్తూ తాను ఈ సినిమాకి జీరో రెమ్యూనరేషన్ తీసుకున్నా అని తెలిపాడు. తనకు ఈ సినిమాకి ఇవ్వాలి అనుకున్న రెమ్యునరేషన్ ను తన ఏడో ఒక సినిమా బడ్జెట్ మీద పెట్టమని ప్రదీప్ ఆ చిత్ర నిర్మాతలకు చెప్పాడట. అలా ఈ సినిమా కోసం తన రెమ్యునరేషన్ ను త్యాగం చేశాడట. కానీ ఈ సినిమా ప్రాఫిట్స్ లో మాత్రం ప్రదీప్ పర్సెంటేజ్ రూపంలో రెమ్యునరేషన్ తీసుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఇది తెలిసిన నెటిజన్స్ మరియు సినీ వర్గం వారు తన మొదటి సినిమా కోసం ప్రదీప్ బాగానే ఆలోచించాడని ప్రశంసిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మొత్తానికి ప్రదీప్ మాచిరాజు తన మొదటి సినిమాతోనే సూపర్ స్ట్రాటజీతో ఉన్నాడని అర్ధం అవుతుంది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.