తెలుగు ప్రేక్షకులందరు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన సీజన్ 4 ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నాగార్జున త్రిపాత్రాభినయంతో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ 4 ప్రోమోతో షో మీద బాగా అంచనాలు పెరిగాయి. అయితే కంటెస్టంట్స్ విషయంలో మాత్రం రోజుకో పేరు తెర మీదకి వస్తుంది. అలాగే తాజా ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి సీజన్ 4 లో పాల్గొనబోతుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకు కారణం లేకపోలేదు.
స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటుంది ప్రగతి. అయితే ఈమద్య సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది. యోగా, జిం చేస్తున్న ఫొటోలు, వీడియోలు పెడుతూ హడావుడి చేస్తున్నారు. సినిమాలలో హీరోలకు తల్లి పాత్రలో నటించి ఎంతో హుందాగా కనిపించిన ప్రగతి సోషల్ మీడియాలో మాత్రం చాలా ట్రెండీ గా కనిపించి షాకిస్తోంది. కాగా కొందరు ఇదంతా బిగ్ బాస్ కోసమేనా అన్న ప్రచారం మొదలైంది.
సోషల్ మీడియాలో ప్రగతి చేస్తున్న వీడియోలు పబ్లిసిటీ కోసం అని ఆ పబ్లిసిటీ బిగ్ బాస్ ఎంట్రీ కోసం అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారట. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మొదలవుతున్న నేపథ్యంలో నిర్వాహకుల నుంచి ప్రగతి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చేందుకు పిలుపొస్తుందన్న ఆలోచనతో ఇలా సోషల్ మీడియాలో కనిపిస్తుందన్న టాక్ వచ్చింది.
ఈ విషయంలో రీసెంట్ గా ప్రగతి క్లారి ఇచ్చారు. ఇప్పటి వరకు ఫేమ్ లేని వారు తమ గురించి ప్రేక్షకుల్లో అభిప్రాయంను మార్చుకోవాలనుకునే వారు.. డబ్బుకు ఆశ పడే వారు మాత్రమే బిగ్ బాస్ కు వెళ్తారు. నాకు అవన్నీ ఉన్నాయి. వాటికోసం నేను తాపత్రయపడం లేదని తెలిపారు.
ఫేమ్ నాకు ఇప్పటికే ఉంది.. నాకు ప్రేక్షకుల్లో మంచి పేరు ఉంది.. డబ్బు గురించి అతిగా ఆలోచించను. కాబట్టి నేను బిగ్ బాస్ కు వెళ్లాలనుకోవడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అయినా మళ్లీ ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రగతి స్పందిస్తూ నేను బిగ్ బాస్ లో పాల్గొనబోవడం లేదని ..వస్తున్నవన్నీ రూమర్స్ అని.. ఒకవేళ నిర్వాహకులే వచ్చి నన్ను అడిగినా నాకు ఆసక్తి లేదని చెప్పేస్తాను..అంటూ స్పష్టం చేశారు.