Pragathi: తెలుగు సినిమా ప్రేక్షకులకు నటి ప్రగతి అందరికీ సుపరిచితమే.. నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.. ఎన్నో సినిమాల్లో తల్లి, అత్త,పిన్ని పాత్రల్లో నటించింది.. తెలుగు తమిళ, మలయాళ భాషల్లో సుమారు 120 కి పైగా సినిమాల్లో నటించింది.. ప్రగతి సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటుంది.. నటనలోనే కాదు డాన్సులోను ఇరగతీస్తాను అనేలా అప్పుడప్పుడు వీడియోలు విడుదల చేస్తోంది.. తాజాగా బాలీవుడ్ సినిమా ఐయా లోని సాంగ్ ‘డ్రీమమ్ వేకపమ్’ అనే పాటకు ఆమె డాన్స్ చేసి ఇరగదీసింది..

ఇంతకుముందు వీడియో ఇంతకుముందు రిలీజ్ చేసిన వీడియోలు కంటే ఈ వీడియో నంగా బ్రేక్ డాన్స్ లా చేశారు ప్రగతి. ఈ వీడియోలో మరో మహిళతో కలిసి ప్రగతి డాన్స్ చేశారు. మొత్తంగా చూస్తే ఈ వీడియోలో ఆమె డాన్స్ అదుర్స్.. ప్రగతి తన ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియోతో అందరికీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే విషెస్ తెలిపారు.
సినిమాల్లో కేవలం సంప్రదాయ పాత్రల్లో మాత్రమే నటిస్తూ ఎంతో పద్ధతిగా చీర కట్టులో కనిపించే ప్రగతి. గత సంవత్సరం లాక్ డౌన్ సమయంలో ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టింది. ఆ లాక్ డౌన్ టైం లో ఎక్సర్సైజులు, జుంబా డాన్స్ వీడియోలు, మామూలు డాన్స్ వీడియో లు చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసేది. 44 ఏళ్ళ వయసులో ఫిజికల్ ఫిట్నెస్ పై ఆడవాళ్ళు సైతం పరిస్థితి వచ్చేసింది. దీంతో ప్రగతికి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఐయా అనే సినిమా లోని ఈ సాంగ్ ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండ్ అవుతుంది. ఈ పాటకు స్టెప్పులేసి ప్రగతి సోషల్ మీడియాని మరోసారి షేక్ చేసింది.