Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్..టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోయిన్గా, గ్లామర్ బ్యూటీగా మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. కంచె సినిమాతో భారీ హిట్ అందుకున్న ఈమె ఆ తర్వాత మాత్రం ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయింది. చేయడానికైతే చాలా సినిమాలు చేసింది. కానీ వాటిలో ఆమెని స్టార్ హీరోయిన్ గా తారా స్థాయికి తీసుకు వచ్చే సినిమా ఒక్కటి కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయ జానకి నాయక సినిమాలో అలాగే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన నక్షత్రం సినిమాలోనూ ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ రోల్స్ లో అలరించింది.
అయినా స్టార్ స్టేటస్ దక్కించుకోలేకపోయింది. మంచి అవకాశాల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఈ బ్యూటీకి లక్కీగా బాలకృష్ణ సినిమాలో ఆయనకి జంటగా నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోంది. దాదాపు చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ గ్యారెంటీగా సూపర్ హిట్ అందుకొని ఇండస్ట్రీ క్రేజీ ఆఫర్స్ అందుకుంటుందని చాలా నమ్మకంగా ఉందట. బాలయ్య – బోయపాటి లకి ఈ మధ్య మంచి హిట్ దక్కలేదు కాబట్టి ఎంతో కసిగా హిట్ కొట్టాలని అఖండ చేస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ కి అఖండ భారీ విజయాన్ని ఇస్తుందని చెప్పుకుంటున్నారు.
Pragya Jaiswal : వెంకటేశ్ – వరుణ్ తేజ్‌ల సినిమా అనగానే ప్రగ్యాకి మంచి క్రేజ్ పెరిగింది.
అయితే ఈ బ్యూటీ విక్టరీ వెంకటేశ్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లతో కలిసి ఓ మాస్ సాంగ్ కి స్టెప్స్ వేయబోతుందట. వీరు హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ ఎఫ్ 3. ఇందులో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ సాంగ్ చేయబోతోందట. అటు బాలయ్య సినిమా ఇటు వెంకటేశ్ – వరుణ్ తేజ్‌ల సినిమా అనగానే ఈ బ్యూటీకి మంచి క్రేజ్ పెరిగింది. ఎఫ్ 2 స్పెషల్ సాంగ్ లో అనసూయ భరద్వాజ్
కనిపించింది. ఈసారి ప్రగ్యా జైస్వాల్ కనిపించబోతోంది. ఈ రెండు సినిమాలతో మళ్ళీ టాలీవుడ్ లో తన సత్తా చాటడం గ్యారెంటీ అంటున్నారు. కాగా ప్రగ్యా జైస్వాల్ బాలీవుడ్ లో కూడా ఓ క్రేజీ మూవీ లో నటిస్తోంది.