మళ్లీ పవన్ పై ప్రకాష్ రాజ్ కామెంట్లు..!!

Prakash Raj: Entry in Active Politics Through Janasena
Share

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా ఉందన్న సంగతి తెలిసిందే. పోటీకి ప్రధాన పార్టీలు అన్నీ బరిలోకి దిగిన చాలావరకు పోటాపోటీ టిఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల సినీ నటుడు ప్రకాష్ రాజ్ టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ పలు టీవీ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ వస్తున్నారు.

Prakash Raj Comments on Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై ప్రకాష్  రాజ్ సంచలన వ్యాఖ్యలు! | ఏపీ News in Teluguహైదరాబాదు ప్రశాంతంగా ఉండాలంటే కచ్చితంగా కేసీఆర్ పార్టీని గెలిపించాలని ప్రకాష్ రాజ్ కోరుతున్నారు. ఈ క్రమంలో రాజకీయాలు గురించి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ తో కలవటం జిహెచ్ఎంసి ఎన్నికల సపోర్ట్ చేయడంపై కాంట్రవర్సి కామెంట్లు చేయడం జరిగింది.

 

రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ఓటు బ్యాంకు కలిగి పవన్ కళ్యాణ్ బిజెపికి సపోర్ట్ చేయటం దారుణమని కామెంట్లు చేస్తూ గతంలో ఇదే పవన్ బిజెపిని వ్యతిరేకించి మళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకోవటం బట్టి చూస్తే ఊసరవెల్లి స్వభావము తరహాలో వ్యవహరిస్తున్నట్లు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు ఇటీవల వైరల్ అవ్వడం జరిగింది. ఈ క్రమంలో నాగబాబు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లకు గట్టిగానే కౌంటర్ వేయటం అందరికీ తెలిసిందే. పరిస్థితి ఇలా ఉండగా మరొక సారి ప్రకాష్ రాజ్ పవన్ ప్రస్తావన తీసుకు వచ్చే సరికొత్త వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అంటే సినిమాపరంగా తనకు ఇష్టం కానీ పొలిటికల్ గా ఆయన సిద్ధాంతాలు నాకు నచ్చవు అని చెప్పుకొచ్చారు. ప్రొఫెషనల్ రంగం వేరు రాజకీయ రంగం వేరు.. ప్రస్తుతం పవన్ చేస్తున్న పెద్ద సినిమా ‘వకీల్ సాబ్’ షూటింగ్ లో అనేక విషయాల గురించి మాట్లాడతాను ఆయన నాతో మాట్లాడుతారు అని ప్రకాష్ తెలిపారు. అంతే కాకుండా ఇటీవల నేను రాసిన ‘దోసిట చినుకులు’ అనే పుస్తకాన్ని పవన్ చదివి మీకు డిఫరెంట్ ఐడియాలజీ ఉందని ప్రశంసించారు అంటూ రాజకీయం సిద్ధాంతాలను విభేదిస్తున్న వ్యక్తిగతంగా ఎవరికి ఎవరితోనూ అంతగా తగాదాలు ఉండవు అంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.


Share

Related posts

Delta virus: అతి ప్రమాదకర ఇండియన్ డెల్టా వైరస్ కు చెక్ చెప్పే వ్యాక్సిన్లు ఇవి రెండే…!

arun kanna

శ్రీరాముడు బలపర్చిన పార్టీ…! (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేకం పార్ట్ -1)

somaraju sharma

KCR: కేసీఆర్ మ‌రిన్ని వ‌రాలు… నేడే ప్ర‌క‌ట‌న‌

sridhar