ప్రకాష్ రాజ్ ఒకే ఒక్క డైలాగ్ తో పొలిటికల్ గా పవన్ పరువు తీసేసాడు..!!

సినీ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న గ్రేటర్ ఎన్నికలు గురించి తీవ్ర స్థాయిలో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. దీనిలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. దీంతో గ్రేటర్ ఎన్నికల వేళ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాలలో పవన్ వ్యవహరిస్తున్న వైఖరిని తప్పుబట్టారు.

Arguments between Prakash Raj & Pawan Kalyanమేటర్ లోకి వెళ్తే పవన్ ఒక పార్టీకి అధినేత అయ్యుండి వేరొక పార్టీకి భజన ఎందుకు చేస్తున్నారు అని విమర్శించారు. పవన్ తీసుకున్న తాజా నిర్ణయానికి పార్టీ కార్యకర్తలతో పాటు తనని నిరుత్సాహానికి గురి చేసింది అని తెలిపారు ప్రకాష్ రాజ్. 2014 ఎన్నికల సమయంలో ఇంద్రుడు చంద్రుడు అంటూ టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్…గత ఎన్నికలు వచ్చేసరికి వాళ్ళు ద్రోహులు అని పవన్ అన్నారు.

 

కానీ అదే ద్రోహులు ఇప్పుడు మీకు నాయకులు గా కనిపిస్తున్నారు, మీరు ఇన్ని సార్లు మారుతున్నారు అంటే ఊసరవెల్లి అయి ఉండాలి అంటూ పవన్ పరువు పోయేలా ప్రకాష్ రాజ్ ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్లు చేశారు. అసలు రెండు తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కి ఉన్న ఓటుబ్యాంకు ఏంటి బిజెపి కి ఉన్న ఓటు బ్యాంకు ఏంటి అని అన్నారు ప్రకాష్ రాజ్. కనీసం ఓటు బ్యాంకు లేని బీజేపీతో పవన్ కళ్యాణ్ కి పొత్తు అవసరమా అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికలలో తన ఫుల్ సపోర్ట్ టీఆర్ఎస్ పార్టీకి ఉంటుందని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. మతాలు కులాలు ఇలా విభజించి రాజకీయాలు చేసే పార్టీలతో చాలా జాగ్రత్తగా ఉండాలని.. హైదరాబాద్ ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉంది. భవిష్యత్తులో కూడా ప్రశాంతంగా ఉండాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ గెలవటం అవసరమని ప్రజలకు ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు.