Prakash raj: పోకిరి మూవీలో ఆలీభాయ్ రోల్ కాకుండా ఆ రెండు రోల్స్ చేసి ఉంటే ప్రకాష్ రాజ్ వేస్ట్ అనేవారా..?

Share

Prakash raj: పూరి జగన్నాధ్ సినిమా అంటే అన్నీ హై ఓల్టేజ్‌లో ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. హీరోకు కావాల్సిన మాస్ ఇమేజ్ ఇండస్ట్రీలో ఇచ్చే ఒకే ఒక్క దర్శకుడు పూరి జగన్నాధ్. గ్లామర్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా హీరోయిన్‌కు విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టే దర్శకుడు పూరినే. ఇందుకు ఉదాహరణ అనుష్క శెట్టి, ఆసిన్ లాంటి వారే. ఇక పూరి సినిమాలో విలన్స్ కూడా చాలా హైలెట్‌గా నిలుస్తుంటారు. విలన్ ఎంత ఠఫ్‌గా ఉంటే..హీరోను అంత రఫ్‌గా చూపించొచ్చు అనేది పూరి ఫార్ములా. ఆ ఫార్ములా బాగా వర్కౌట్ చేస్తారు పూరి. అందుకే ఆయన సినిమాలలో విలన్స్‌ కూడా బాగా పాపులర్ అవుతుంటారు.

prakash-raj-got fame by alibai role in pokiri
prakash-raj-got fame by alibai role in pokiri

విలన్స్ మాత్రమే కాదు పూరి రాసే కామెడీ ట్రాక్‌తో కమెడియన్స్ కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంటారు. అందుకు ఉదాహరణ పోకిరి సినిమాలోని కామెడీ ట్రాకే..అందులో నటించిన కమెడియన్సే. మ్యూజిక్ పరంగా, లిరిక్స్ పరంగా పూరి సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్స్‌కు, గీత రచయితలకు బాగా పేరు తీసుకు వస్తాయి. అలా పూరి సినిమాకి పనిచేసిన అందరికీ ఈక్వల్ క్రెడిబులిటీ దక్కుతుంది. అది పూరి చేసే మ్యాజిక్. అందుకే ఆయన సినిమా అంటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తారు. ఇక పూరి అంటే ఇండస్ట్రీలో ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఒక దర్శకుడిగానే కాకుండా వ్యక్తిగా కూడా పూరీ చాలా మందికి కనెక్ట్ అయ్యారు.

Prakash raj: ప్రకాష్ రాజ్ పోషించిన లాయర్ పాత్రకు నందా అని పెట్టడం అది బాగా హైలెట్ అవడం తెలిసిందే.

అలా బాగా కనెక్ట్ అయిన నటుడు ప్రకాష్ రాజ్. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన సినిమాలతో ప్రకాష్ రాజ్‌కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. బద్రి సినిమాలో ప్రకాష్ పోషించిన క్యారెక్టర్ నందా జీవిత కాలం గుర్తుండిపోతుంది. ఇప్పటికీ నందా అనే పాత్ర గురించి అందరూ మాట్లాడుకుంటున్నారంటే బద్రిగా పవన్ కళ్యాణ్, నందాగా ప్రకాష్ రాజ్ ఎలా పోటీ పడి నటించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ – ప్రకాష్ రాజ్ అదే సినిమాను గుర్తు చేసుకోవడం.. ఇందులో ప్రకాష్ రాజ్ పోషించిన లాయర్ పాత్రకు నందా అని పెట్టడం అది బాగా హైలెట్ అవడం తెలిసిందే.

కాగా ఇటీవల ఆలీతో సరదాగా అనే కార్యక్రమానికి ప్రకాష్ రాజ్ గెస్ట్‌గా వచ్చారు. ఈ షోలో ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్న ప్రకాష్ రాజ్ పోకిరి సినిమాలో ఆయన పోషించిన ఆలీభాయ్ పాత్ర గురించి ..ఆ పాత్ర అసలు ఎలా చేసే ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చారు. వాస్తవంగా పూరి జగన్నాధ్.. పోకిరి సినిమాలో ముందు ప్రకాష్ రాజ్‌కు అనుకుంది ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే పోషించిన పోలీస్ పాత్రలు. ఈ రెండింట్లో ఒక రోల్ చేయాలనున్నా గానీ ఎందుకనో ప్రకాష్ రాజ్‌కు అవి ఎక్కలేదు. దాంతో ఆడెవడో వస్తాడన్నావ్ కదా ..ఆడెవడు..ఆ రోల్ ఏంటీ అని పూరిని ప్రకాష్ రాజ్ అడిగాడట.

Prakash raj: అలా ఆలీభాయ్ రోల్ ప్రకాష్ రాజ్ చేయడానికి ఒప్పుకున్నాడు.

 

అది చాలా చిన్న రోల్ జస్ట్ 7 రోజులు మాత్రమే ఉండే రోల్ అని పూరి చెప్పాడట. లేదు అయినా నాకు ఆ రోల్ కావాలి. అది చేస్తే నాకు బావుంటుందని ప్రకాష్ రాజ్ చెప్పాడట. అలా ఆలీభాయ్ రోల్ ప్రకాష్ రాజ్ చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే అది చాలా చిన్న రోల్ కావడంతో షూటింగ్ సమయంలో పూరి అక్కడికక్కడే అలీభాయ్ రోల్ బాగా డెవలప్ చేసి క్యారెక్టర్ లెంగ్త్ పెంచి బాగా హైప్ తీసుకువచ్చారు. ఒకవేళ అలీభాయ్ రోల్ కాకుండా మిగతా రెండు రోల్స్ చేసి ఉంటే ప్రకాష్ రాజ్ కెరీర్‌లో పోకిరి సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు.


Share

Related posts

సినిమావాళ్ళని వణికిస్తున్న సైబర్ నేరగాళ్ళు ..విజయ్ దేవరకొండని వదల్లేదు ..!

GRK

త‌ల్లి పాల‌తో క‌రోనా వ్యాపించ‌దు.. సైంటిస్టుల అధ్య‌య‌నంలో వెల్ల‌డి..!

Srikanth A

జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం…తేడా వ‌చ్చేస్తోందా?

sridhar